ఆ రెండు సభలపై కేసీఆర్ టెన్షన్ ? టీఆర్ఎస్ సభకు ప్లాన్ ? 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది.మొన్నటి వరకు పెద్దగా ప్రభావం చూపించని కాంగ్రెస్, బీజేపీలు ఒక్కసారిగా పుంజుకోవడం, ఈ రెండు పార్టీలు విడివిడిగా భారీ బహిరంగ సభలు నిర్వహించడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి.

 Kcr Tention On Congress Bjp Meeting-TeluguStop.com

ఈ రెండు పార్టీల సభలు సక్సెస్ కాకుండా తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా , భారీగా జనాలు హాజరు కావడాన్ని కెసిఆర్ సీరియస్ గా తీసుకున్నారు.ఈ రెండు పార్టీల ప్రభావం పెద్దగా ఉండదు అనే ఆలోచనతోనే కేసీఆర్ సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.

పూర్తిగా హుజూరాబాద్ ఎన్నికల పైనే దృష్టి పెట్టి , అక్కడ సంక్షేమ పథకాలు అమలుపై రివ్యూ నిర్వహిస్తున్నారు.కెసిఆర్ ఫామ్ హౌస్ కి సమీపంలోని కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించింది.

 Kcr Tention On Congress Bjp Meeting-ఆ రెండు సభలపై కేసీఆర్ టెన్షన్ టీఆర్ఎస్ సభకు ప్లాన్  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా కెసిఆర్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. 
  మరోవైపు నిర్మల్ లో బిజెపి అంతే స్థాయిలో సభను నిర్వహించి సక్సెస్ అయింది.

ఈ సభకు ప్రధాన ఆకర్షణగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు.ఈ రెండు పార్టీల సభలు నిర్వహించడంతో ఈ సభలపై జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి అనే విషయంపై కెసిఆర్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఆరా తీస్తున్నారు.

దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినా, ఆ క్రెడిట్ దక్కకుండా ఇప్పటివరకు దళితుల అభ్యున్నతి కోసం ఎన్ని నిధులు ఇచ్చారంటూ ప్రశ్నించడం వంటివి టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి.

Telugu Amith Sha, Bjp Meeting, Congress Gajvel Meeting, Hujurabad, Kcr, Kcr Public Meeting, Pcc President, Revanth Reddy, Telangana Cm, Telangana Politics-Telugu Political News

కాంగ్రెస్, బిజెపి షర్మిల  పార్టీ ఇలా అందరూ మూకుమ్మడిగా తమపై విమర్శలు చేస్తున్న క్రమంలో తాము భారీ బహిరంగ సభను నిర్వహించి ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారట.

అసలు ఇప్పటికే టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించాల్సి ఉన్న కరోనా ప్రభావంతో వాయిదా వేశారు.ఈ రెండు కలిసి వచ్చే విధంగా వచ్చే నెలలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.

#Revanth Reddy #Congress Gajvel #Kcr Public #Bjp #PCC

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు