ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవకూడదనేదే కేసీఆర్ లక్ష్యమా?

తెలంగాణలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తరువాత మరల జరుగుతున్న ఎన్నికలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.ఇప్పటికే అన్ని పార్టీలు పట్టభద్రులను ప్రసన్నం చేసుకుంటూ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

 Is Kcr's Goal That Bjp Should Not Win In Mlc Elections?,kcr, Mlc Elections, Bjp,-TeluguStop.com

అయితే ఇప్పటికే దుబ్బాకలో బీజేపీ గెలిచి టీఆర్ఎస్ కు షాకిచ్చింది.అలాగే గ్రేటర్ లో కూడా బీజేపీ సత్తా చాటడంతో కేసీఆర్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవడానికి ఇప్పటికే రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్న కేసీఆర్ ఎట్టి పరిస్థితులలో బీజేపీ గెలవకూడదని భావిస్తున్నాడట.అయితే ఇప్పటికే బలంగా ప్రచారం చేసిన బీజేపీ గెలుస్తామనే గట్టి నమ్మకంతో ఉన్నారట.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచి సత్తా చాటితే బీజేపీ ఇంకాస్త బలం పుంజుకొని నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సిద్ధమయ్యే అవకాశం ఉంది.ఒకవేళ టీఆర్ఎస్ సత్తా చాటితే అక్రమంగా గెలిచిందని దుష్ప్రచారం చేసి టీఆర్ఎస్ కు ఆ క్రెడిట్ దక్కనీయకుండా చూసే అవకాశం ఉంది.

ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ కు ఆశించిన ఫలితం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.ఇప్పటికే జిల్లా ఇంచార్జ్ లను ప్రకటించిన కేసీఆర్, ఇంచార్జ్ లు గెలుపు వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నారు.

పట్టభద్రులు ఎవరి వైపు మొగ్గుచూపుతారనేది ఎన్నికల ఫలితం వరకు వేచి చూడక తప్పదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube