ఆ నలుగురు x ఒకే ఒక్కడు ..రాజకీయ టార్గెట్ ఫిక్స్ .

శత్రువుకి శత్రువు మిత్రుడు అనేది నేటి రాజకీయాల్లో పాటించే సూత్రం ! తమతో బాగా ఉన్నంతవరకే మితృత్వం .అలా కాదని తోక జాడిస్తే ఇక అంతే సంగతులు.

 Kcr Target Person Was Fixd In Elections 2019-TeluguStop.com

ఇప్పడు ఇదే విధానాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీద ప్రయోగించబోతున్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్ష్యం అన్నట్టుగా బీజేపీ, జనసేన, వైసీపీ , టీఆర్ఎస్, పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ఓడించడానికి తెరవెనుక వీరంతా కలిసి పనిచేసేందుకు సిద్ధం అవుతున్నారు.

తెలుగుదేశం పార్టీకి ప్రధాన శత్రువులుగా బీజేపీ,జనసేన, వైసిపీలు ఉన్నాయి.వీరికి తోడుగా ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కలిసి చంద్రబాబుని ఓడించేందుకు సిద్ధం అవుతున్నాడట.తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగిన తరువాత.

ఈ నలుగురు చంద్రబాబు ని ఫుల్ టార్గెట్ చేసి ఉక్కిరిబిక్కిరి చేసేందుకు రెడీ అవుతున్నారు.ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తానని కెసిఆర్‌ ఇప్పటికే తేల్చి చెప్పారట.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిచినా గెలవకపోయినా చంద్రబాబు కనుక కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తే తాను ఆంధ్రాలో పర్యటిస్తానని బాబును ఓడించాలని ప్రజలకు చెబుతానని కెసిఆర్‌ చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.అవసరం అయితే ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌కు ఆర్థికంగా కూడా సహాయం కూడా అందించేందుకు సిద్ధమని కేసీఆర్ చెప్తున్నాడట.

ఒకవైపు చూస్తే జగన్‌, పవన్‌, మోది చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా వారికి కేసీఆర్ తోడయ్యే ఛాన్స్ కనిపిస్తుండడంతో బాబుకి రాజకీయంగా ఇబ్బంది తప్పదనే వాదన వినిపిస్తోంది.

అయితే ఈ పరిణామాలను ఎదుర్కోవడానికి బాబు ఎటువంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube