ఆర్టీసీపై ఫైనల్‌ నిర్ణయంకు కేసీఆర్‌ సిద్దం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను చాలా తేలికగా తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది.వారి డిమాండ్ల పరిష్కారంకు అస్సలు అంగీకరించేది లేదు అంటూ ప్రభుత్వం ఉంది.

 Kcr Take The Final Decission On Telangana Rtc Strike-TeluguStop.com

ఇప్పటికే ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉంది.ప్రభుత్వం దాన్ని తీసుకుని నష్టాలను భరించాల్సిన అవసరం లేదు అంటూ కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీలోకి ప్రైవేట్‌ వారిని భాగస్వామ్యం చేస్తే ప్రయాణికుల కష్టాలు తొలగిపోవడంతో పాటు పోటీ తత్వం పెరిగి ప్రజా రవాణ మెరుగు పడుతుందని ఇటీవలే కేసీఆర్‌ అన్న విషయం తెల్సిందే.ఆయన వ్యాఖ్యలతో ఆర్టీసీ ప్రైవేటీకరణ ఖాయం అంటూ అనిపిస్తుంది.

ఇక ఎల్లుండి ఆర్టీసీ సమ్మెపై మాట్లాడేందుకు క్యాబినేట్‌ సమావేశంను ఏర్పాటు చేస్తున్నారు.సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేలా ప్రైవేట్‌ బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఆ విషయాన్ని మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో చాలా వరకు ప్రైవేట్‌ బస్సులు ఉన్నాయి.ఆ బస్సుల సంఖ్యను మరింతగా పెంచాలని కూడా భావిస్తున్నారు.ఇక దాదాపు అయిదు వేల రూట్లలో ప్రైవేట్‌ బస్సులకు అనుమతులు ఇచ్చి ప్రయాణం సులభతరం మరియు చౌక చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.

నెల రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube