అబ్బబ్బబ్బా...కేసీఆర్ తెలివితేటలు ఈ రేంజ్ లో పెరిగిపోయాయా ..?

తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలివితేటలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి.ఇప్పుడు అసలే గెలుపు జోష్ మీద ఉన్న కేసీఆర్ మంత్రి మండలి ఏర్పాటు మీద మాత్రం ఆశావాహులను ఊరిస్తూ… ఉబ్బిస్తూ ఉన్నాడు.

 Kcr Take A Convenient Decision In Parliament For His Kothari1-TeluguStop.com

ఎన్నికల ఫలితాలు వచ్చి చాలా రోజులే అయినా ఇంకా ముహూర్తం అంటూ లేట్ చేస్తూనే ఉన్నాడు.సంక్రాంతి పండుగ అనంతరం అంటే ఈ నెల 18వ తేదీన మంత్రివర్గ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం టిఆర్ఎస్ లో జోరుగా జరుగుతోంది.

ప్రస్తుతం కేసీఆర్ కోటరీ నాయకులు అందరికీ మంత్రి పదవి పదవులు దక్కే అవకాశం లేకపోవడంతో….మంత్రి అనే పేరు లేకుండానే కొత్తగా మంత్రులను తీసుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యాడు.

అంటే మంత్రి అనే పేరు లేకుండా… మంత్రి పదవులు అనుభవించే అవకాశం ఉంటుంది.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్‌ మీటింగ్ లో ఆ పేరును పార్లమెంటరీ కార్యదర్శులుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఇలా చేయడానికి న్యాయ పరమైన కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.రాజ్యాంగంలోని 164 నిబంధన ప్రకారం సభ్యుల సంఖ్యలో 15 మందిని మాత్రమే తీసుకునే అవకాశం ఉండడంతో ఈ విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

మిగతా వారిని పార్లమెంటరీ కార్యదర్శులు పేరుతో నియమించినా … అనేక సందర్భాల్లో వాటిని కోర్టులు కొట్టివేశాయి.దీంతో ఆ హోదా కి పేరు మార్చి కొన్ని రాష్ట్రాలు కొనసాగిస్తున్నాయి.

కేసీఆర్ కూడా అదే రూట్ లో వెళ్లి తన కోటరీ నాయకులకు ఆ పదవులు కట్టబెట్టాలని చూస్తున్నాడు.

అయితే వీరికి మంత్రులు వలె అసెంబ్లీలో సమాధానం చెప్పే అవకాశం లేకపోవడంతో చట్టంలో ఆ మేరకు మార్పు తేవాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యాడు.

వాస్తవానికి గతంలోనే పార్లమెంటరీ కార్యదర్శులు ఉన్నా… కోర్టులో కొట్టివేయడంతో మళ్లీ నియమించలేదు.ఈసారి మాత్రం వారి పేరు మార్చి నియమించాలని కేసీఆర్ భావిస్తున్నాడు.

అయితే అసలు ఎందుకు కొట్టివేశారు అన్న విషయాలను పూర్తిగా పరిశీలించి ఆ మేరకు కొత్త నిబంధన తీసుకురావాలని కేసీఆర్ అనుకుంటున్నాడు.తమకు మంత్రి పదవులు దక్కడం లేదని కీలక నాయకులు ఎవరూ… అసంతృప్తి గురవకుండా ఈ విధంగా పదవులు పంచాలని కెసిఆర్ అనుకుంటున్నాడు.

అయితే కేసీఆర్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube