కరోనా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎలాగైతే కరోనా విజ్రుంభిస్తుందో తెలంగాణలో కూడా ఇదే తరహా విజృంభణ కొనసాగుతోంది.కరోనా మొదటి వేవ్ లో కేసులు భారీగా నమోదయినా, మరణాలు మాత్రం తక్కువగా నమోదయ్యాయి.
కాని కరోనా సెకండ్ వేవ్ లో కేసులు భారీగా నమోదవుతూనే, మరణాలు కూడా విపరీతంగా సంభవిస్తున్నాయి.అయితే తెలంగాణలో కరోనా నియంత్రణ పట్ల కేసీఆర్ వేస్తున్న వ్యూహాలు వరుసగా విఫలమవుతున్నాయి.
అయితే మొదటి వేవ్ లో కొంత కేసీఆర్ వ్యూహాలు ఫలించినా సెకండ్ వేవ్ లో మాత్రం మాత్రం కేసీఆర్ వ్యూహాలు మాత్రం ఫలించడం లేదు.
అయితే మొదట లాక్ డౌన్ విధించకుండానే కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని మొదట భావించినా, ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు పెద్ద ఎత్తున ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మరల లాక్ డౌన్ నిర్ణయానికే కేసీఆర్ రావడం జరిగింది.
అయితే సరిహద్దు రాష్ట్రాల అంబులెన్స్ లను ఆపి, తెలంగాణలో ఉన్న కోవిడ్ బాధితులకు బెడ్స్ అవకాశం కల్పించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నా, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరల తిరిగి అనుమతించాల్సి వచ్చింది.దీంతో కరోనా పట్ల కేసీఆర్ వ్యూహాలు విఫలవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది.