రహస్య సర్వేలతో కేసీఆర్ బెంబేలెత్తిస్తున్నాడా ?  

Kcr Survey On Party Leaders In Telangana-

తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ఇప్పట్లో ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు.దాదాపు నాలుగున్నరేళ్ళపాటు నిరాటంకంగా పరిపాలన మీద దృష్టిపెట్టవచ్చు...

Kcr Survey On Party Leaders In Telangana--KCR Survey On Party Leaders In Telangana-

కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ విషయాలకంటే మరేదో విషయాల గురించి ఎక్కువ తెలుసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే ఇప్పుడు రహస్యంగా ఎమ్యెల్యేలు, మంత్రుల పనితీరుపై కేసీఆర్ రహస్యంగా కేసీఆర్ సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది.మరీ ముఖ్యంగా 18 నియోజకవర్గాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతల పనితీరుపై ఆరా తీయాలని కేసీఆర్ అబిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.గడచిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను బిజెపి గెలుచుకుంది.

సికింద్రాబాద్ మినహా మిగతా మూడు చోట్లా టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఎక్కువ కనిపించింది.

Kcr Survey On Party Leaders In Telangana--KCR Survey On Party Leaders In Telangana-

చివరికి, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది.ఈ పరిణామాలన్నీ కేసీఆర్ కు మింగుడుపడడంలేదట.అందుకే ఈ స్థానాల్లో పార్టీ ఎందుకు వెనకబడింది అనే విషయంపై లోతుగా అధ్యయనం చేయిస్తున్నారట.

ఈ మేరకు హైదరాబాద్ కి చెందిన ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్లతో ఒక బృందానికి ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.విషయం స్పష్టంగా తెలియాలంటే ప్రొఫెసర్లే కరెక్ట్ అనేది కేసీఆర్ అభిప్రాయంగా తెలుస్తోంది.ఈ బృందం టీఆర్ఎస్ ఓటమిపాలైన లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో పర్యటించినట్టు సమాచారం...

సికింద్రాబాద్ మినహా, ఇతర లోక్ సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ బృందం ఇప్పటికే పర్యటించింది.వారిది దృష్టికి వచ్చిన ప్రధాన కారణం, టీఆర్ఎస్ నాయకుల ఓవర్ కాన్ఫిడెన్స్ అని తేలిందట.

అంతే కాదు పార్టీ నుంచి ఖర్చులకు వచ్చిన సొమ్మును కూడా దారిమళ్లించినట్టు తేలిందట.

ఆదిలాబాద్ జిల్లాల్లో ఆదివాసీల గొడవలు టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారినట్టు గుర్తించారు.రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేల వైఖరిలో మార్పే, ప్రజలకు చికాకు తెప్పించినట్టుగా తేలిందట.మూడు స్థానాల్లో ఓటమికి కారణమైన ఎమ్మెల్యేలు, జిల్లాల్లో ఉన్న మంత్రుల పనితీరు మీద కూడా కేసీఆర్ నివేదిక తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఆ ప్రొఫెసర్ల బృందం పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన తరువాత బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నాడట.