మున్సిపల్ షాక్ తప్పదా ? కేసీఆర్ సర్వేలో తేలింది ఏంటి ?

తన పరిపాలన గురించి, తన మంత్రివర్గ సహచరుల గురించి, ప్రభుత్వ పథకాల గురించి ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ పనితీరును అంచనా వేసుకుంటూ ఉంటాడు.తెలంగాణ సీఎం కేసీఆర్.

 Kcr Survey On Municipal Elections-TeluguStop.com

తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి కూడా ఈ సర్వ్ రిపోర్ట్స్ కారణమనెడి అందరికి తెలిసిన విషయమే.సర్వేల ఆధారంగానే టిక్కెట్లు కేటాయింపులు కూడా చేపట్టారు కేసీఆర్.

అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చాక పెద్దగా ఈ సర్వేల మీద దృష్టిపెట్టాలలేదు కేసీఆర్.కానీ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు వస్తున్న తరుణంలో సర్వేలపై మరోసారి దృష్టిపెట్టాడు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తమదే అన్న ధీమాలో ఉన్న కేసీఆర్ కు లోక్ సభ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చిన సంగతిని మర్చిపోలేకపోతున్నాడు.

-Telugu Political News

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడించాలని కేసీఆర్ భావిస్తున్నాడు.అందుకే చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.దీనిలో భాగంగానే ఓ సర్వే చేయించినట్టుగా కూడా తెలుస్తోంది.

ఈ సర్వేలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం తదితర చోట్ల టీఆర్ఎస్ కు అంత ఆశాజనకమైన ఫలితాలు రావనే విషయం తేలిందట.అంతే కాదు ఈ ప్రాంతాల్లో గతంలో కంటే ఇప్పడు ప్రత్యర్థి పార్టీలు బాగా బలం పుంజుకున్నట్టు తేలిందట.

దీనికి కారణం ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి అంటూ ఏదీ కనిపించకపోవడం, మౌలిక సదుపాయల కల్పనలో కొంత వెనకబాటులో ఉండడం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో ఉండకపోవడం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయట.

ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యలను, నాయకుల సమస్యలను పట్టించుకోలేదని అసంతృప్తి బాగా పెరిగిపోయింది.

పార్టీ తీరుపై ద్వితీయ శ్శ్రేణి నాయకులు కూడా గుర్రుగా ఉన్నారట.ఈసారి మైనారిటీ ఓట్లు మొత్తంగా పడితే తప్ప చాలా చోట్ల టీఆర్ఎస్ కు కాస్త పోరాటం తప్పదనే అభిప్రాయం సర్వేలో వచ్చిందట.

మొత్తానికి, మున్సిపల్ ఎన్నికలు కేసీఆర్ లో బాగా గుబులు పెంచుతున్నట్టుగానే కనిపిస్తోంది.అందుకే ఇప్పటి నుంచే ఎక్కడికక్కడ స్థానిక ఎమ్యెల్యేలను బాద్యులు గా చేయడంతో పాటు మంత్రులకు కూడా వీటిపై టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube