గేర్ మార్చిన కేసీఆర్‌.. ఆ నిర్ణ‌యాల‌తో డైల‌మాలో ప‌డ్డ జాతీయ పార్టీలు

Kcr Strategies National Parties In Dilemma With Those Decisions

కేసీఆర్ ఎవ‌రినైనా టార్గెట్ చేశారంటే వారిని త‌న‌దైన స్టైల్ లో ప్ర‌జ‌ల్లో విల‌న్ ను చేసేస్తారు.ఇది ఆయ‌న‌కు మొద‌టి నుంచి ఉన్న విద్య‌.

 Kcr Strategies National Parties In Dilemma With Those Decisions-TeluguStop.com

గ‌తంలో ఉద్య‌మ స‌మ‌యంలో కూడా తెలంగాణ నేత‌ల‌ను ఆయ‌న ఇలాగే ప్ర‌జల్లో ఇరికించేసి దూకుడును ప్ర‌ద‌ర్శించారు.అలా టీఆర్ఎస్‌ను తెలంగాణ‌లో బలోపేతం చేశారు.

ఇక రెండోసారి సీఎం అయిన త‌ర్వాత కొద్దిగా హ‌వా త‌గ్గింద‌నే చెప్పుకోవాలి.ఈ క్ర‌మంలోనే బీజేపీ క్ర‌మంగా పుంజుకోవ‌డంతో కేసీఆర్ వ్యూహం మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది.

 Kcr Strategies National Parties In Dilemma With Those Decisions-గేర్ మార్చిన కేసీఆర్‌.. ఆ నిర్ణ‌యాల‌తో డైల‌మాలో ప‌డ్డ జాతీయ పార్టీలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్వ‌యంగా ఆయ‌నే రంగంలోకి దిగిపోయారు.

త‌న సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వాన్ని రంగ‌రించి బీజేపీ గ్రాఫ్‌ను త‌గ్గించేయాల‌ని డిసైడ్ అయిపోయారు.

మ‌రీ ముఖ్యంగా మొన్న‌టి హుజూరాబాద్ ఎన్నిక‌ల ఎఫెక్ట్ త‌ర్వాత త‌న ఫోక‌స్ పూర్తిగా బీజేపీ మీద‌కు మ‌ళ్లించారు.ఇందులో భాగంగానే వ‌డ్ల కొనుగోలు విష‌యంలో బీజేపీని టార్గెట్ చేసి ప్ర‌జల్లో పూర్తిగా విల‌న్ ను చేసేశారు.

అంతే కాదు అటు పార్ల‌మెంటులో కూడా టీఆర్ ఎస్ ఎంపీల‌తో ఆందోళ‌న‌లు చేయించి తాము రైతుల ప‌క్షాన ఉన్న‌ట్టు నిరూపించుకున్నారు.ఇక ఇన్ని చేస్తున్నా కూడా తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు టీఆర్ ఎస్‌, బీజేపీ ఒక్క‌టే అంటూ ప్ర‌చారం చేస్తున్నారు.

Telugu Bjp, Congress, Farmers, Kcr, Keshavarao, Rahul Gandhi, Rakesh Tikayat, Trs Mps, Trs Pary, Ts-Telugu Political News

మొన్న రైతు ఉద్య‌మ నేత రాకేశ్ టికాయ‌త్ కూడా వ‌చ్చి బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అంటూ విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో కేసీఆర్ మ‌రో ప్లాన్ వేశారు.రీసెంట్ గా ఢిల్లీలో రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో జరిగినటువంటి విపక్ష పార్టీల మీటింగ్ కు అనూహ్యంగా గులాబీ పార్టీ హాజ‌రైంది.టీఆర్ఎస్ త‌ర‌ఫున కేశవరావు అటెండ్ కావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది.దీంతో తాము బీజేపీతో ఒక్క‌టిగా లేమ‌ని డిసైడ్ చేసేశారు కేసీఆర్‌.ఇలా ఒకే దెబ్బ‌కు అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌ను దెబ్బ తీశార‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు.

#Farmers #Kcr #Rahul Gandhi #Trs Pary #Congress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube