హుజూరాబాద్‌లో చ‌క్రం తిప్పుతున్న కేసీఆర్‌.. కాంగ్రెస్‌, బీజేపీల నేత‌లే టార్గెట్‌..!

రాజ‌కీయ వ్యూహాలు పన్న‌డంలో మొద‌టి నుంచి టీఆర్ ఎస్ నేత‌లు దిట్ట‌లుగా పేరు గాంచారు.వారంతా కేసీఆర్ నేతృత్వంలో వ్యూహాలు ర‌చిస్తూ ఎన్నో విష‌యాల్లో స‌క్సెస్ అయ్యారు.

 Kcr Spinning The Wheel In Huzurabad .. Congress And Bjp Leaders Are The Target .-TeluguStop.com

అయితే ఇన్ని రోజులు రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక వ‌చ్చినా హరీశ్‌రావుకో లేదా కేటీఆర్ కో అప్పగించేసి ఎంచ‌క్కా రెస్ట్ తీసుకున్న కేసీఆర్‌ ఇప్పుడు స్వ‌యంగా వ్యూహాలు ర‌చించే ప‌రిస్థితి వ‌చ్చింది.కార‌ణం ఈట‌ల రాజేంద‌ర్ లాంటి బ‌ల‌మైన నేత‌ను ఢీ కొట్టాలంటే త‌న అనుభ‌వాన్ని రంగ‌రించాల్సిందేన‌ని కేసీఆర్ డిసైడ్ అయిపోయారు.

అందుకే ఈట‌ల రాజేంద‌ర్‌ను ఢీ కొట్టేందుకు తాను స్వ‌యంగా హుజూరాబాద్ రాజ‌కీయాన‌లు చూస్తున్నారు.

Telugu Congress, Harish Rao, Peddi Redy, Renavth Reddy, Ts Congrsee, Ts Poltics-

అక్క‌డ హ‌రీశ్ రావును ఇన్ చార్జిగా నియ‌మించినా కూడా అన్ని తానే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు.త‌న‌కు ఉద్య‌మ కాలం నుంచి ఆయా పార్టీల్లో ఉన్న సంబంధాల‌ను బేస్ చేసుకుని కాంగ్రెస్, బీజేపీల‌కు దెబ్బ తీస్తున్నారు.ఇందుకోసం ఆయా పార్టీల్లో కీల‌కంగా ఉంటున్న వారిని హుజూరాబాద్‌లో త‌న పార్టీలోకి లాగేస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ త‌ర‌ఫున అభ్య‌ర్థి అవుతాడ‌నుకున్న కౌశిక్ రెడ్డిని ఏరికోరి మ‌రీ కేసీఆర్ త‌న పార్టీలో చేర్చుకున్నారు.ఇక దాంతో కాంగ్రెస్‌కు అభ్య‌ర్థి దిక్కులేకుండా అయిపోయాడు.ఇక ఇప్పుడు బీజేపీని దెబ్బ తీసే ప‌నిలో ప‌డ్డారు కేసీఆర్‌.

Telugu Congress, Harish Rao, Peddi Redy, Renavth Reddy, Ts Congrsee, Ts Poltics-

ఇందుకోసం బీజేపీలో మొద‌టి నుంచి కీల‌కంగా ఉంటున్న ఇనుగాల పెద్దిరెడ్డిని టీఆర్ ఎస్‌లో చేర్చుకునేందుకు ప్లాన్ వేశారు.ఇప్ప‌టికే ఆయ‌న ఈట‌ల చేరిక‌తో అంస‌తృప్తితో ఉన్నారు.ఆయ‌న గ‌తంలో హుజూరాబాద్‌లో ఈట‌ల‌పై బీజేపీ నుంచి పోటీ చేశారు.

ఆయ‌న‌కు గ్రామాల్లో మంచి ప‌ట్టు కూడా ఉంది.దీంతో ఆయ‌న్ను చేర్చుకుంటే ఎంతో కొంత బీజేపీని దెబ్బ తీయొచ్చ‌నే ప్లాన్‌తో కేసీఆర్ ఆయ‌న్ను పార్టీలోకి ఆహ్వానించారు.

దీంతో ఆయ‌న నిన్న బీజేపీకి గుడ్ బై చెప్పారు.త్వ‌ర‌లోనే టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు.

వీరే కాదు త్వ‌ర‌లోనే మ‌రింత మంది హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్ కండువా క‌ప్పుకునేందుకు రెడీ అవుతున్నారు.మొత్తాన‌కి కేసీఆర్ చ‌క్రం బాగానే తిప్పుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube