బీజేపీపై కెసీఆర్ ప్రత్యేక నిఘా... అసలు కారణం ఇదేనా?

తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ బలపడుతుంది.ఒకప్పుడు బీజేపీ తెలంగాణలో అంతగా బలంగా లేకున్నా బలపడడానికి కృషి చేస్తున్న పరిస్థితి ఉంది.

 Kcr Special Surveillance On Bjp ... Is This The Real Reason  Bjp Party, Telangan-TeluguStop.com

అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తరువాత బీజేపీ ఒక్కసారిగా పుంజుకున్న విషయం తెలిసిందే.అయితే మొదట్లో బీజేపీని లైట్ తీసుకున్న కెసీఆర్ ఆ తరువాత బీజేపీ బలపడటాన్ని కెసీఆర్ గమనిస్తూ ఉన్న పరిస్థితి ఉంది.

అయితే టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్న పరిస్థితులలో ఓటర్లు బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ఎన్నుకున్నారు.అందుకు ప్రత్యక్ష ఉదాహరణ జీహెచ్ఎంసీ ఎన్నికలు.

ఒకప్పుడు ఇద్దరు కార్పొరేటర్ లను మాత్రమే కలిగి ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఏకంగా 40 కి పైగా కార్పొరేటర్ లను సాధించింది.అయితే ప్రస్తుతం బీజేపీ పుంజుకుంటున్న తీరుతో ఒక్కసారిగా కెసీఆర్ ఇంకా రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైతే అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం కష్టమని భావించి బీజేపీపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఇంటిలిజెన్స్ సమాచారాన్ని తెప్పించుకుంటున్న పరిస్థితి ఉంది.

అయితే బీజేపీ టార్గెట్ గా ఇంకా టీఆర్ఎస్ ఇంకా విమర్శలు ప్రారంభించనప్పటికి లోలోపల బీజేపీ పై ఎంతో కొంత మాత్రం కలవరపాటుకు మాత్రం గురవుతున్నట్టు సమాచారం.అంతేకాక బీజేపీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్థానాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ కు పట్టున్న కీలక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆయా నియోజకవర్గాలలో బీజేపీ ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా వ్యూహ రచన చేస్తోంది బీజేపీ.

అంతేకాక బీజేపీ తరహా రాజకీయాన్ని ఇప్పటికే ప్రారంభించిన బీజేపీ టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టే వ్యూహాలను సిద్దం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.చూద్దాం మరి బీజేపీ బలం టీఆర్ఎస్ ను ఎంత వరకు బలహీనపరుస్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube