కొడంగల్ కోటలో కేసీఆర్ పాగా కి పక్క స్కెచ్ రెడీ     2017-11-19   23:24:44  IST  Bhanu C

తెలంగాణలో ఇప్పుడు రాజకీయం మళ్ళీ కొడంగల్ వైపు చూస్తోంది. ఏపీలో మొన్న ఆగస్టులో జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో అక్కడ అధికార పార్టీ తెలుగుదేశం నాయకత్వం ఎన్నో ప్యుహరచనలు చేసి గెలుపొందిందో అందరికీ తెలిసిన విషయమే..చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నంద్యాల ఉపఎన్నిక గెలుపు అంత ఈజీగా రాలేదు ఏపీ మంత్రులు అందరు నంద్యాలలోనే మకాం వేశారు. నంద్యాల అభివృద్దిలో అప్పటికప్పుడు నిర్ణయాలని ప్రకటించారు.ఇలా మొత్తానికి నంద్యాలలో టిడిపి జెండా ఎగిరేలా చేశారు.

అయితే ఇప్పుడు అదే సీన్ కొడంగల్ లో జరగబోతోందని తెలుస్తోంది..టిడిపి నుంచీ కాంగ్రెస్ లోకి జంప్ చేసిన రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రేవంత్ రాజీనామాతో ఇప్పుడు మరలా కొండగల్ లో ఉపఎన్నికలు జరగనున్నాయి. అయితే తెలంగాణా సిఎం కేసీఆర్ కొడంగల్ ఎన్నికలని చాల ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంటున్నారట. రేవంత్ వంటి బ‌ల‌మైన అభ్య‌ర్థిని ఢీ కొనేందుకు త‌న వంతు వ్యూహంగా పావులు కదుపుతున్నారు..అందులో భాగంగానే సీఎం కేసీఆర్ త‌న మేన‌ల్లుడు, మంత్రి హ‌రీష్ రావును రంగంలోకి దింపారు. ఈ క్ర‌మంలోనే కొడంగ‌ల్‌ నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకులని కారేక్కించేశారు.

తన మేనమామ ఆజ్ఞతో హరీష్ రావు ముఖ్యంగా ఐదు మండలాలపై ఫోకస్‌ పెట్టారు. అందుకు అనుగుణంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కోస్గి, మద్దూరు మండలాల్లోని పెండింగ్‌ పనులు, చేపట్టాల్సిన కొత్త పనులపై కార్యాచరణ చేపట్టారు. ఈ మేరకు జిల్లాకు చెందిన ప్రతీశాఖకు చెందిన ఉన్నతాధికారులను హైదరాబాద్‌లోని సచివాలయానికి పిలిపించుకొని మంతనాలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డిలు నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

కొడంగల్ పరిధిలో ఉన్న గ్రామాలు అన్నిటిలో పారశుద్ధ్యం, దోమ‌లు వంటి కీల‌క అంశాల‌పై నా దృష్టి పెట్టారు. ఇలా ఒకరి తరువాత ఒకరిగా అధికారులని పంపి సమస్యలని అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నారట..మొత్తానికి ఈ విషయంలో కేసీఆర్ మాత్రం చంద్రబాబు ని ఫాలో అవుతూ రేవంత్ కి చెక్ పెట్టేయనున్నాడు అంటున్నారు.అయితే రేవంత్ ఇంకా రాజీనామా స్పీకర్ కి అందించలేదు సో మరి ఉపఎన్నిక జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే కొడంగల్ వాసులకి మాత్రం కష్టాలు తీరుతున్నాయి.