కేసీఆర్ భయపడేది బీజేపీకా రాజేందర్ కా  ? 

ఎట్టకేలకు టిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పెద్ద సంచలనం సృష్టించారు టిఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్.కేవలం రాజీనామాతో సరిపెట్టకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, కేసీఆర్ తీరును రాజేందర్ తప్పు పట్టారు.

 Kcr Silent On Etela Rajender Issue Bjp, Trs,kcr, Telangana, Palla Rajeswarareddy-TeluguStop.com

ఎప్పటి నుంచో తనకు పార్టీలో అవమానాలు జరుగుతున్నాయని, తనపై కక్ష గట్టి అవమానకరంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు అంటూ రాజేందర్ ఓ రేంజిలో ఫైర్ అయ్యారు .ఈ సందర్భంగా హరీష్, కేసిఆర్ కుమార్తె కవిత ప్రస్తావన తీసుకొచ్చిన ఈటెల తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు.సహజంగానే రాజేందర్ విమర్శలకు కేసీఆర్ స్పందిస్తారని, రాజేందర్ చేసిన విమర్శలకు సమాధానం ఇచ్చి ఆయన మాట్లాడేందుకు అవకాశం లేకుండా చేస్తారని అంత భావించారు.కానీ కేసీఆర్ సైలెంట్ అయిపోయారు.

అటు కేటీఆర్, కవిత, హరీష్ ఎవరూ ఈ విషయంపై స్పందించలేదు.కానీ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రమే రాజేందర్ విమర్శలకు సమాధానం ఇచ్చారు.

రాజేశ్వర్ రెడ్డి తో పాటు మరికొంత మంది నేతలు ఈ విషయంపై స్పందించి రాజేందర్ ది ఆత్మ గౌరవం కాదు అని, ఆస్తులను కాపాడుకునేందుకే ఆయన ఈ విధంగా కెసిఆర్, టిఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.మంత్రి ఈటెల రాజేందర్ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారు అంటూ టిఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉండడం, తిరిగి ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది.

తమ కేబినెట్ లో మంత్రిగా పని చేసిన ఈటెల అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే, కేసీఆర్ ఎందుకు చూస్తూ వదిలేశారని ? ఈ వ్యవహారాలను ఎందుకు బయటకు తీయలేదు అని ఇంకా అనేకమంది మంత్రులు ఎమ్మెల్యేల పైన ఇంతకంటే ఎక్కువ అవినీతి విమర్శలు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి.రాజేందర్ వ్యవహారంపై మరీ లోతుగా విమర్శలు చేస్తూ వెళ్తే, తిరిగి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ సైలెంట్ అయిపోయారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Telugu Hareesh Rao, Hujurabad, Palla Rajeswara, Telangana, Telangana Cm-Telugu P

 అయితే రాజేందర్ బిజెపిలో చేరి పోతుండడంతో ముందు ముందు బిజెపి కారణంగా తమకు ఇబ్బందులు ఎదురవుతాయని కెసిఆర్ వెనక్కి తగ్గుతున్నారు అనే అనుమానాలు ఎన్నో కలుగుతున్నాయి.దుబ్బాక జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా బీజేపీ అగ్రనేతల పై విమర్శలు చేసిన కేసీఆర్ ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలవడం, ఆ తరువాత పూర్తిగా బిజెపి విషయంలో సైలెంట్ అయిపోయారు.ఇప్పుడు రాజేందర్ వ్యవహారంలో లోతుగా విమర్శలు చేసినా , బీజేపీ నుంచి ఇబ్బందులు తప్పవు అనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఉన్నట్టు ఒక ప్రచారం జరుగుతుండగా, కెసిఆర్ టిఆర్ఎస్ కు సంబంధించిన అనేక కీలక వ్యవహారాలు రాజేందర్ కు బాగా తెలుసునని, అవి ఆయన బయటపెడితే తమకు ఇబ్బంది అనే ఉద్దేశంతోనే రాజేందర్ విషయంలో కెసిఆర్ మౌనంగా ఉంటున్నారనే ప్రచారం మరోవైపు జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube