ప్రతిపక్షాల విమర్శల పట్ల కేసీఆర్ మౌనం... వ్యూహం ఇదే?

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు అధికార పార్టీపై విమర్శల బాణాలను ఎక్కుపెడుతున్నారు.

 Kcr Silence On Opposition Criticism Is This The Strategy, Kcr, Trs Party, Bjp Pa-TeluguStop.com

ప్రస్తుతం తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతున్నదని, ప్రజలు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో పెద్ద ఎత్తున ఇబ్బందుల పాలు అవుతున్నారని, ప్రజలు ఈ ప్రభుత్వం నుండి విముక్తి కోరుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతోంది.

అయితే ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రతిపక్షాల విమర్శలకు ఏ మాత్రం సమాధానం ఇవ్వడం లేదు.ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా ఎవరూ స్పందించని పరిస్థితి ఉంది.

మరి కేసీఆర్ ఎందుకు ప్రతిపక్షాల విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఒకసారి విశ్లేషించుకుంటే ప్రజలు ప్రభుత్వ పనితీరును అల్టిమేట్ గా ప్రజలు పరిశీలిస్తారు కాబట్టి పాలన పైనే దృష్టి పెట్టాలని మంత్రులను కేసీఆర్ కోరారు.విమర్శలకు స్పందిస్తూ పోతే ఇక పనిచేయాల్సిన మనం కూడా మాటలు చెబితే ఇక ప్రజలు ప్రభుత్వం పని చేయడం ఆపేసిందని ప్రభుత్వం నుండి ఏమీ ఆశించకుండా ప్రతిపక్షాల వైపు చూసే అవకాశం ఉంటుందని కేసీఆర్ అంతర్గతంగా తెలిపినట్లు తెలుస్తోంది.

Telugu @bjp4telangana, @cm_kcr, @revanth_anumula, Bandi Sanjay, Congress, Kcr Si

అంతేకాక ప్రతిపక్షాల బలాబలాల  మీద వాళ్ళు రాష్ట్రంలో వారి ప్రభావాన్ని రోజు రోజుకు ఎంత మేర పెంచుకుంటున్నారనే దానిపై కేసీఆర్ కు ఇంటిలిజెన్స్ సాయంచారం కావచ్చు, సర్వే ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఏ  నిర్ణయమైనా ఆచితూచి తీసుకునే కేసీఆర్ ప్రతిపక్షాలకు తాను మౌనంగానే ఉంటూ సరికొత్త గా ప్రతిపక్షాలకు ఝలక్ఇచ్చే అవకాశం ఉంది.ఎందుకంటే కేసీఆర్ వ్యూహాలు ఎవరికి అంత తొందరగా అర్ధం కావడం కష్టం.కావున రానున్న రోజుల్లో కేసీఆర్ ఎలా స్పందిస్తాడానేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube