ప్రతిపక్షాల దూకుడుపై కెసీఆర్ మౌనం... అసలు కారణం ఇదేనా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.అయితే ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితి ఉంది.

 Kcr Silence On Opposition Aggression Is This The Real Reason, Telangana Politics, Kcr-TeluguStop.com

టీఆర్ఎస్ పార్టీ కి ప్రత్యామ్నాయ పార్టీలుగా మారాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెంచాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.అయితే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున దూకుడు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా కెసీఆర్ మౌనం వహిస్తూ వస్తున్నారు.

అయితే ఇంతటి విమర్శలు వస్తున్నా కెసీఆర్ మౌనంగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.అయితే ఇంకా ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు ఉండటంతో అప్పటి వరకు ఇప్పటి పరిస్థితుల కంటే పూర్తి భిన్నంగా అప్పటి పరిస్థితులను టీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చే వ్యూహంతో కెసీఆర్ సిద్ధంగా ఉన్నారనే ఒక చర్చ కొనసాగుతోంది.

 KCR Silence On Opposition Aggression Is This The Real Reason, Telangana Politics, Kcr-ప్రతిపక్షాల దూకుడుపై కెసీఆర్ మౌనం#8230; అసలు కారణం ఇదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే గత రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేశాయి.అయినా సరే కెసీఆర్ ను ఓడించలేక పోయారు.అయితే అలా అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా కెసీఆర్ ను ఓడించలేక పోవడానికి ప్రధాన కారణం కెసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలో అన్ని పార్టీలు తమకు తెలియకుండానే కెసీఆర్ గెలుపుకు దోహదపడ్డాయి.అయితే కెసీఆర్ ఎప్పుడు ఎలాంటి వ్యూహంతో పరిస్థితులను ఎటువైపు తిప్పుతాడో చెప్పడం ఊహించడం చాలా కష్టమని పలువురు రాజకీయ  విశ్లేషకులు ఇప్పటికీ పలు సందర్భాలలో కూడా ప్రస్తావిస్తూ ఉంటారు.

అయితే ప్రతిపక్షాలు ఇంతగా విమర్శలు చేస్తున్నా కెసీఆర్ మౌనంగా ఉన్నారంటే కూడా ఎక్కడో ప్రతిపక్షాలను తమదైన శైలిలో తన వలలో పడేసుకునేలా తెర వెనుక రంగం సిద్దం చేసుకుంటూ ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

KCR Silence On Opposition Aggression Is This The Real Reason, Telangana Politics, Kcr - Telugu @cm_kcr, @revanth_anumula, @trspartyonline, Bandi Snjay, Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube