తెలంగాణలో వేడి పుట్టిస్తున్న కేసీఆర్ “బెస్ట్ ఆఫ్ త్రీ”

తెలంగాణా రాజకీయాల్లో బెస్ట్ ఆఫ్ త్రీ పైనే ఎక్కువ చర్చ జరుగుతోంది.అసలు ఏంటి ఈ బెస్ట్ ఆఫ్ త్రీ అంటే ఏంటి.? ఎందుకు టీఆర్ఎస్ లీడర్స్ అందరు వణికిపోతున్నారు అనే విషయంలోకి వెళ్తే.చంద్రబాబు లాగా కేసీఆర్ కూడా సర్వేలు నిర్వహిస్తున్నాడు అయితే రెగ్యులర్ గా ప్రభుత్వం చేయించుకునే సర్వేలు కాదు ఓ ప్రైవేటు వారితో కలిపి కేసీఆర్ సర్వేలు నిర్వహిస్తున్నాడట.

 Kcr Shocking Survey In Telangana-TeluguStop.com

దానిలో వింత ఏముంది.అందురు చేసేదే…నేతలకి వణుకు ఎందుకు అనే ఆలోచన రాకపోదు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే…

కేసీఆర్ ఒకే అంశంపై మూడు రకాలుగా సర్వేలు చేపట్టనున్నారు అని తెలుస్తోంది.

అయితే ఒక సర్వే అయిన తరువాత మరొక సంస్థలో అలా మరో సంస్థతో ఇలా మొత్తం మూడు రకాల సర్వేలు చేయించనున్నారు.అయితే ఈ సర్వేలు అన్నీ కూడ తెలంగాణాలో ప్రజల సమస్యలని టీఆర్ఎస్ ఎంతవరకూ పరిష్కరించింది.

నియోజకవర్గాల వారీగా ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి.ఎమ్మెల్యేల పనితీరు.

ఎంపీల పని తీరు, టిడిపి ,కాంగ్రెస్ నుంచీ వచ్చిన వారికి ప్రజలలో ఎలాంటి ఆదరణ ఉంది.ఎలాంటి పధకాలు ప్రజలు కావాలని అనుకుంటున్నారు.

ఇప్పుడు ఉన్న పధకాల మీద వారి భావన ఏమిటి ఇలా అనేక అంశాల మీద సర్వే ఉంటుందట అయితే.

ముఖ్యంగా నేతల పని తీరు ,మంత్రుల వ్యవహారాలపై కూడ యీ సర్వే ఉంటుందట.

మొత్తం మూడు సర్వేలలో వచ్చిన సర్వేల ఆధారంగానే ఎన్నికల్లో అభ్యర్దులకి టిక్కెట్లు ఇవ్వనున్నారని తెలుస్తోంది.అయితే మూడు సర్వేలలో నేతలకి అటు ఇటు అయినా అనుకూలంగా రిపోర్ట్ వస్తేనే వారు కేసీఆర్ లిస్టు లో ఉంటారాట లేకపోతే వారికి ఉద్వాసన తప్పదు అంటున్నారు.

అంతేకాదు.ఇప్పుడు కేసీఆర్ పై ఎమ్మెల్యేలు అందరు లో లోపలే మంది పడుతున్నారు ఈ బెస్ట్ ఆఫ్ త్రీ వల్ల ఎక్కడ వారి సీట్లకి ఎసరు వస్తుందో అని తెగ కంగారు పడుతున్నారు.

మరి కేసీఆర్ అనుకున్న ఈ బెస్ట్ ఆఫ్ త్రీ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందా లేదా అనేది కేసీఆర్ మాత్రమే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube