హరీష్ రావు పై కేసీఆర్ ప్లాన్ చుస్తే షాక్ అవుతారు     2017-12-12   22:31:21  IST  Bhanu C

తెలంగాణా ఉద్యమంలో కేసీఆర్ కి ఎంత పాత్ర ఉందో తన మేనల్లుడు హరీష్ రావు కూడా అంతే కష్టపడ్డారు ఈవిషయం తెలంగాణలో ఉన్న ఎవ్వరిని అడిగినా చెప్తారు…ఉద్యమాల సమయంలో తన మేనమా వెంటే ఉన్న హరీష్ కేసీఆర్ లా ధారాళంగా మాట్లాడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు..అభిమానులని సంపాదించుకున్నాడు.తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక హరీష్ కి మంత్రి పదవి ఇచ్చి కొడుకుని కూడా రంగం లోకి దింపి..మెల్ల మెల్లగా హరీష్ ని పక్కకి తప్పించాడు..ఇప్పటి వరకూ ఈ విషయం అందరు గమనిచిందే అయితే

కేసీఆర్ మధ్యమధ్యలో హరీష్ ని డమ్మీ చేస్తూ కొడుకుని ముందు పెడుతూ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని హరీష్ రావుని సైడేస్తూ వస్తున్నాడని టాక్..మొన్న జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు దీనికి నిదర్సనం అని అంటున్నారు విశ్లేషకులు.,ఇదిలా ఉంటే తాజాగా కేసీఆర్ హరీష్ రావు విషయంలో చేసిన కామెంట్ సంచలనం రేపుతున్నాయి.

సోమవారం జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర మాట్లాడుతూ ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో మంత్రి హరీశ్ పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తమకు నీళ్లు అందిస్తారని నమ్మకంతో ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో హరీష్ బాగా పనిచేశారు అంటూ మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలూ చర్చలకి దారితీస్తున్నాయి.నిన్న మొన్నటివరకు హరీష్ ని సైడ్ చేస్తూ కేసీఆర్ మాస్టర్ ప్లాన్స్ వేస్తూ వచ్చారు ఇప్పుడు ఏకంగా మెచ్చుకుంటున్నారు అంటూ అందరు తలలు పట్టుకున్నారట…అయితే ఇక్కడే కేసీఆర్ తన రాజకీయ చతురత చూపించారు.

ఇటీవల కేసీఆర్ హరీష్ ని తోక్కేస్తున్నారు అంటూ వార్తలు వచ్చిన తరుణంలో పాజిటివ్ వాతావరణం తీసుకురావడానికి సీఎం చేసిన వ్యాఖ్యలు చేసి ఉంటారు అని కొంతమంది అనుకున్నారు..కానీ అసలు విషయం ఇదేనంటూ విశ్లేషకులు కేసీఆర్ ప్లాన్ చెప్పేశారు…అదేంటంటే..తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు భారాన్ని హరీశ్ రావుపై మోపుతున్నారని ఇప్పటికే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరం అయిన మేరకు నిధులు ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటివరకు పూర్తయిన పనుల కోసం కాంట్రాక్టర్లకు డబ్బులివ్వలేదని… అలాంటిది వాటిని సకాలంలో పూర్తి చేసేలా చూడాలంటూ భారం హరీష్ మీద పెట్టడం వెనకాల మతలబు ఏమిటో అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు..నిధులు ఇవ్వకుండా… పూర్తి కానీ పనుల భారం మంత్రి హరీష్ మీద పెట్టి హరీష్ ని అసమర్ద మంత్రిగా తెలంగాణా ప్రజలకి చూపించే ప్రయత్నమే ఇది అంటున్నారు విశ్లేషకులు..మరి హరీష్ ఈ విషయంలో స్పందిస్తార..లేదంటే ఎప్పటిలానే మౌనంగా ఉంటారా అనే విషయం ముందు ముందు అయినా తెలుస్తోందో లోదో చూడాలి