రాజకీయాల్లో వ్యూహచతురత చాలా ముఖ్యమని రాజకీయవేత్తలు, పెద్దలు చెప్తుంటారు.కాగా, వ్యూహరచనలో సీఎం కేసీఆర్ దిట్ట అని ప్రతిపక్ష పార్టీల నేతలు ఒప్పుకుంటారు.
ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా రకరకాల కొత్త చర్చలకు తెరలేపింది.దళిత బంధుపేరటి కొత్త స్కీమ్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించి, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు.
ఈ పథకం పట్ల ప్రతిపక్ష పార్టీల నుంచి బోలెడన్ని విమర్శలొచ్చాయి.కేవలం ఎన్నికల కోసమే ఇలాంటి స్టంట్లు అంటూ పలువురు ఆరోపించారు.
ఆయా విమర్శలకు చెక్ పెడుతూ సీఎం కేసీఆర్ వ్యూహం మార్చుకుని ముందుకు దూసుకెళ్తున్నారు.అదేంటంటే.
దళిత బంధు కేవలం ఎన్నికల కోసమే అన్న విపక్షాల నోర్లు మూయించేందుకుగాను సీఎం కేసీఆర్ వేరే ఏరియాలోనూ ఆ స్కీమ్ డబ్బులు రిలీజ్ చేశారు.తాజాగా తన దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్‌లోని వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటించారు.ఆ విలేజ్‌లోని గ్రామంలోని దళితుల ఇళ్లలో కలియ తిరిగిన సీఎం దళిత బంధు ఇక్కడి నుంచే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
దాంతో ప్రతిపక్షాలు ప్రస్తుతం ఇరకాటంలో పడ్డాయి.
సదరు విలేజ్‌లోని 76 దళిత కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు తెలుపుతూ, రూ.7.6 కోట్లను వెంటనే మంజూరు చేశారు.ఆ డబ్బలు వారి వారి అకౌంట్స్‌లో జమ అవుతాయి.ఇక వాసాలమర్రిలో దళితులకు వంద ఎకరాలపైగా ఉన్న ప్రభుత్వ భూమిని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.
కేసీఆర్ తీసుకున్న ఈ స్టెప్‌తో విపక్షాలు ఇక సైలెంట్ అయ్యే చాన్సెస్ ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.నిజానికి దళిత బంధుకు ఈ నెల 16న ముహుర్తం ఖరారు చేసిపప్పటికీ ముఖ్యమంత్రి ముందే దానిని ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
దళిత జాతిని ఆదుకునేందుకు ఈ స్కీమ్ తీసుకున్నట్లు పింక్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.