పవన్ విమర్శలపై కేసీఆర్ గుర్రు ! ఎదురుదాడికి సిద్దమైన టీఆర్ఎస్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా టీఆర్ఎస్ మీద అనేక విమర్శలు చేస్తున్నాడు.తెలంగాణాలో ఆంధ్రావారిని కొడుతున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు.

 Kcr Serious On Pawan Kalyan Comments-TeluguStop.com

అనుకోని రీతిలో పవన్ నుంచి ఎదురుదాడి మొదలవ్వడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉలిక్కిపడ్డారు.అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు టీఆర్ఎస్ పార్టీ మీద అనేక విమర్శలు చేసినా పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా ఈ విమర్శలు చేయిస్తున్నారని కేసీఆర్ ఒక అంచనాకు వచ్చాడు.

అందుకే ఇకపై పవన్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చి ఎదురుదాడి మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాడు.

ఇప్పుడు ఏపీలో జరగబోయే ఎన్నికల్లో టిడిపి ఘోరంగా పరాజయం అవుతుందని దీనికోసం టిఆర్ఎస్ కొత్తగా గా ఏపీలో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని పార్టీ నాయకులకు కేసీఆర్ చెప్పుకొస్తున్నాడు.

తనకు అందిన రిపోర్ట్స్ ప్రకారం ఏపీలో టిడిపి ప్రభుత్వం రాదని, వైసీపీని గెలుస్తుందని కేసీఆర్ పార్టీ శ్రేణులు చెబుతున్నాడు.ఈ విషయం చంద్రబాబు నాయుడు కూడా ముందే తెలిసిపోయిందని, అందుకే పవన్ కళ్యాణ్ ద్వారా టీఆర్ఎస్ పై విమర్శలు చేయిస్తున్నాడని ప్రజల్లో తెలుగు దేశం ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని దాన్ని డైవర్ట్ చేయడానికి టీఆర్ఎస్ పై పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ ద్వారా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని కెసిఆర్ చెబుతున్నాడు.

అన్నదమ్ములవలె కలిసిమెలిసి ఉంటున్న తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య పవన్ ఇప్పుడు రాజకీయ దురుద్దేశాలతో చిచ్చుపెడుతున్నాడని, చంద్రబాబునాయుడు ఓటమి ఎలాగూ తప్పదు కాబట్టి ఎటువంటి విరోధం లేకపోయినా విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ దూకుడు తగ్గించేలా పార్టీ శ్రేణులు కూడా గట్టిగా ఎటాక్ ఇవ్వాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించాడు.అంతేకాకుండా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ పవన్ మాట్లాడిన పేపర్ క్లిప్పింగులను, వీడియోలను సాక్ష్యాలుగా చూపిస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలను ఉద్ధృతం చేయాలని కెసిఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube