మాట వింటారా .. వేటు వేయమంటారా ..?

తెలంగాణాలో ఎన్నికలకు 45 రోజుల గడువు ఉండడంతో.కేసీఆర్‌ ప్రచారం ముమ్మరం చేయకముందే.

 Kcr Serious About Trs Leaders Constituency-TeluguStop.com

అసమ్మతి నేతలను దారికి తెచ్చుకునేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.మాట వినని నేతలపై వేటు వేసేందుకు కూడా వెనకాడబోమనే సంకేతాలను ఇస్తోంది.

ప్రస్తుతం టీఆర్ఎస్ లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయంతో అసమ్మతి నేతలపై వేటు వేస్తోంది.

పార్టీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో అసమ్మతి నేతలు దారికి వస్తారని టీఆర్ఎస్ భావిస్తోంది.

నాయకులు ఎలాంటి పదవుల్లో ఉన్నా సరే .పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించేది లేదని హెచ్చరిస్తోంది.నేపథ్యంలో టికెట్లు దక్కించుకునేందుకు పోటీపడిన నేతలు.

పార్టీ అసమ్మతి కార్యకలాపాలకు తెరలేపడంతో వారిని దారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ ఈ వ్యూహాలు అమలుచేస్తోంది.ఓ వైపు బుజ్జగిస్తూనే.

మరోవైపు పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత గురించి వివరిస్తున్నారు.కొంతమంది నేతలు దారికి వస్తుంటే.

మరికొంతమంది మాత్రం ఎన్నికల బరిలో నిలిచేందుకు సై అంటున్నారు.దీంతో దారిలోకి రాని నేతల వ్యవహారంపై ఇక కఠినచర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో సీనియర్‌ నేత వేనెపల్లి వెంకటేశ్వరరావుపై బహిష్కరణ వేటుపడింది.తాజాగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను కూడా పార్టీ నుండి సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.గత కొన్ని రోజులుగా రాములు నాయక్‌.విపక్ష పార్టీ కీలకనేతలతో భేటీ అయ్యారన్న సమాచారంతో పాటు.పార్టీని వీడేందుకు సిద్దమయ్యారన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే సస్పెన్షన్‌ నిర్ణయాన్ని రాములు నాయక్‌ తప్పుపట్టారు.

గిరిజన నేతను అయినందుకే తనపై చర్యలు తీసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.కానీ క్రమశిక్షణపై రాజీపడేది లేదన్న సంకేతాలను తెలంగాణ రాష్ట్ర సమితి ఇస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube