ఆ నంబర్ సెంటిమెంట్ తో అదరగొడుతున్న కేసీఆర్ ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏది చేసినా, ఎందుకు చేసినా, ఎలా చేసినా అందులో ఒక స్పెషాలిటీ ఉంటుంది.ఎప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

 Kcr Is Following The Sentiment Number 6 For The Construction Of A New Secretaria-TeluguStop.com

అలాగే తెలంగాణ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తూ, ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తన పాలనను మార్చుకుంటూ వస్తుంటారు.అలాగే జనం నాడిని పసిగట్టి దానికి అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవడంలో కేసీఆర్ సిద్ధహస్తులు.

ఇది ఇలా ఉంటే జాతకాలను, వసతులను బాగా నమ్మే కేసీఆర్ వ్యక్తిగతంగా అయినా, సీఎం హోదాలో అయినా తప్పనిసరిగా ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు .అలాగే కేసీఆర్ లక్కీ నంబర్ 06 కావడంతో, 06 సెంటిమెంట్ ను ఆయన బాగా వాడేస్తుంటారు.ఆయన కార్ల నుంబర్లు 6666 .ఎప్పటి నుంచో కేసీఆర్ కు 6 సెంటిమెంట్ ను ఫాలో అవుతూనే వస్తున్నారు.

తాజాగా కొత్త సచివాలయ నిర్మాణాన్ని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.దీనికోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.దీనిలో భాగంగానే ఆ సచివాలయంలోని తన అదృష్ట సంఖ్య అయిన 6 నంబర్ ను బాగానే వాడుతున్నట్లు తెలుస్తోంది.ఈ సచివాలయం ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఆరు అంతస్తుల్లో నిర్మాణం చేయించబోతున్నారు.

అలాగే సచివాలయం చుట్టూ 60 అడుగుల వెడల్పు గల రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు.కొత్త సచివాలయంలో ఆరు కాన్ఫరెన్స్ హాళ్లు, ఆరు డైనింగ్ హాళ్లు, ఆరు పార్కులు, 60 మీటర్ల గుమ్మం, ఇలా అన్ని విషయాల్లోనూ 6 నెంబర్ కు ప్రాధాన్యత కల్పిస్తూ, కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకున్నట్లు గా కనిపిస్తున్నారు.

Telugu Kcrnumber, Kcr Secretariat, Telangana Cm-Telugu Political News

వాస్తు లెక్కలు బాగా ఫాలో అయ్యే కేసీఆర్ ఈ నిర్మాణాలు ప్రతిదీ వాస్తు ప్రకారమే ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సచివాలయం తూర్పున మాత్రమే రోడ్లు ఉండేలా కొత్త సచివాలయం నిర్మాణం ప్లాన్ చేశారు.సుమారు 500 కోట్ల బడ్జెట్ తో 10 నెలల్లోనే దీనిని నిర్మించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ ల ఆధ్వర్యంలో శరవేగంగా కొత్త సచివాలయం నిర్మాణం పూర్తి చేయించి సరికొత్త రికార్డును సృష్టించాలని కెసిఆర్ అభిప్రాయపడుతున్నారు.

పూర్తిగా కేసీఆర్ అభిరుచికి తగ్గట్టుగా ఈ కొత్త సచివాలయం నిర్మాణం కాబోతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube