కేసీఆర్ నోట సంచ‌ల‌న మాట‌లు.. కార‌ణం ఆయ‌నేనా..?

కేసీఆర్ లో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల ఎఫెక్ట్‌, అలాగే ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు అన్ని కూడా బ‌ల‌ప‌డటంతో ఆయ‌న కొంత మార్పు చెందిన‌ట్టే క‌నిపిస్తోంది.

 Kcr Sensational Words Rs Praveen Kumar Is That The Reason, Kcr, Praveen Kumar, B-TeluguStop.com

ఇందులో భాగంగానే వ‌రుస ప‌థ‌కాలు, జిల్లాల టూర్లు ఇత‌ర ప్రోగ్రామ్‌లు వ‌స్తున్నాయి.వ‌రుస‌గా ప‌నుల్లో స్పీడ్ పెర‌గ‌డం కూడా ఇందులోకే వ‌స్తోంది.

ఇక మొన్న‌టి వ‌ర‌కు కేసీఆర్‌కు ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ మాత్ర‌మే పెద్ద స‌వాల్ అనుకునే లోపే కాంగ్రెస్‌కు కొత్త చీఫ్ గా రేవంత్ రావ‌డం మరో స‌వాల్ గా మారంది.

ఇక దీని త‌ర్వాత మాజీ ఐపీఎస్ ప్ర‌వీణ్ కుమార్ కూడా బ‌హుజ‌న నినాదంతో రావ‌డంతో కేసీఆర్‌కు కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డ్డ‌ట్టు అయింది.

ఇన్ని రోజుల వ‌ర‌కు కేసీఆర్ కేవ‌లం నిమ్న కులాల‌కు మాత్ర‌మే అధికారాలు క‌ట్ట‌బెడుతున్నార‌నే అప‌వాద‌న‌లు ఉన్నాయి.ఇక ఇలాంటి త‌రుణంలో కేసీఆర్ కూడా బ‌హుజ‌న నినాదాన్ని త‌ప్ప‌క ఎత్తుకోవాల్సి వ‌స్తోంద‌.

అయితే దాన్ని అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి డైరెక్టుగా చూపించ‌కుండా ఇన్ డైరెక్టుగా త‌క్కువ కులాల‌కు చెందిన వారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కొత్త మాట‌లు మాట్లాడుతున్నారు.

Telugu System, Etela Rajender, Huzurabad, Kcrindepedence, Praveen Kumar, Revanth

అదేంటంటే నిన్న స్వాతంత్ర్య వేడుక‌ల సంద‌ర్భంగా ఏకంగా కులం గోడ‌లు బ‌ద్ద‌లు కొడ‌తామ‌ని, అంత‌రాయాలు లేని స‌మాజాన్ని నిర్మిస్తామ‌ని చెప్పారు.అంతే కాదు ద‌ళితుల‌ను పారిశ్రామికులుగా మారుస్తామ‌ని చెబుతున్నారు.ఈ మాట‌ల‌న్నీ ఇంత‌కు ముందు ఆర్‌.

ఎస్‌.ప్ర‌వీన్‌కుమార్ ప‌దేప‌దే చెబుతున్న డిమాండ్లు.

బ‌హుజ‌నుల‌ను పారిశ్రామికులుగా మార్చాల‌ని ఆయ‌న ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు.ఇక ప్ర‌వీన్ కుమార్ రాక‌తో బ‌హుజ‌న నినాదం బ‌లంగా వినిపిస్తోంది.

ఇలాంటి త‌రుణంలో కేసీఆర్ బ‌హుజ‌నుల‌ను ఇలా పారిశ్రామిక వేత్త‌లుగా మారుస్తామ‌ని చెప్ప‌డం నిజంగా ప్ర‌వీణ్ కుమార్ ఎఫెక్టే అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube