కేసీఆర్ సంచలనం నిర్ణయం... ఇక కారు జోరు ఆపడం కష్టమేనా?

కేసీఆర్ రాజకీయ అపర చాణక్యుడు అనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.ప్రతిపక్షాలకు అందకుండా వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేస్తూ ప్రతిపక్షాలను బొక్క బోర్లా పడేయడంలో కేసీఆర్ ను మించిన వారు లేరని చెప్పవచ్చు.

 Kcr Sensational Decision Is It Difficult To Stop The Car Loudly, Kcr, Trs Party-TeluguStop.com

అయితే అలాంటి రాజకీయ అపరచాణక్యుడు కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే టీఆర్ఎస్, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్న సందర్భంలో, అంతేకాక దుబ్బాక ఓటమితో కొంచెం టీఆర్ఎస్ శ్రేణులు కొంత నిరాశ పడినా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు విజయం సాధించడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

అయితే టీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు వ్యతిరేక ప్రచారం చేస్తున్నా కేసీఆర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.తాజాగా కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సెలూన్లకు, ధోబీ ఘాట్ లకు, లాండ్రీలకు నెలకు 25 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.అయితే కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిర్ణయం ఏప్రిల్ 1 వ తేదీ నుండే అమలు కానున్నట్లు సీఎం వెల్లడించారు.అయితే పలు మార్లు ఈ విషయంపై సీఎంను రజక సంఘాలు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube