తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇక చివరి దశకు చేరుకున్న తరుణంలో కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగించిన విషయం తెలిసిందే.అయితే కేసీఆర్ కాస్త తన ప్రసంగ శైలికి విరుద్ధంగా ఈరోజు ప్రసంగించారని చెప్పవచ్చు.
అయితే తన ప్రసంగంలో భాగంగా భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.అయితే సాధారణంగా ప్రతిపక్షాలపై విరుచుక పడే కెసీఆర్ ఈసారి కొంత హాస్యాస్పదంగా స్పందించడం కొసమెరుపు.
అయితే తన ప్రసంగంలో కేసీఆర్ ప్రతిపక్షాలు బడ్జెట్ ను విమర్శించడం అన్నది సర్వసాధారణమైన విషయమని కానీ మన ఊరు- మన బడి విషయంలో భట్టి విక్రమార్క కు మా పై ప్రేమ గలగడం కాస్త సంతోషకరమైన విషయం అని అన్నారు.
అంతేకాక భట్టి విక్రమార్క లేవనెత్తిన కొన్ని అంశాలకు సంబంధించి స్పష్టత ఇస్తున్న క్రమంలో భట్టి గారి ప్రశ్నలకు సమాధానం మా కంటే బాగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలదని మనందరి తరపున భట్టి గారిని పార్లమెంట్ కు పంపు దామని తన ప్రసంగంలో భాగంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఒక్క సారిగా భట్టి విక్రమార్కతో సహా మిగతా సభ్యులు ఘొల్లున నవ్వారు.
ఇక ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.అంతేకాక తన ప్రసంగంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.
కేంద్ర ప్రభుత్వ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధి డబుల్ ఉందనే విషయాన్ని మరవవద్దని, తెలంగాణ అన్ని రంగాలలో మిగతా రాష్ట్రాల కంటే మెరుగైన స్థానంలో ఉందని కే సీఆర్ వ్యాఖ్యానించారు.ఏది ఏమయినా భట్టి విక్రమార్క ను పార్లమెంట్ కు పంపాలన్న వ్యాఖ్యలు సరదాగా చేసిన వ్యాఖ్యలా లేక ఏదైనా రాజకీయ పరమైన ఉద్దేశ్యం ఉందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.







