ఉత్కంఠ కలిగిస్తున్న టీఆర్ఎస్ హుజురాబాద్ ఎన్నికల విషయంలో అన్ని పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ అయితే ఈ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
ఎవరిని ఇక్కడ అభ్యర్థిగా బరిలోకి దింపితే బిజెపి అభ్యర్థి రాజేంద్ర పై గెలుస్తారు అనే విషయంలో చాలా లెక్కలు వేసుకుంటున్నారు.ఇప్పటికే అనేక సంచలనమైన భారీ పథకాలను అమలు చేస్తున్నారు.
దీంతో పాటు అభివృద్ధి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా సామాజిక వర్గాల సమతూకం పాటిస్తున్న కెసిఆర్ ఆ లెక్కల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసే విషయంపై దృష్టి పెట్టారు.
ఇప్పటికే కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డి, స్వరం రవి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మద్దశాని మాలతి, మద్దసాని పురుషోత్తం రెడ్డి, ఇలా కొంత మంది పేరును ఎంపిక చేసి ఇంటెలిజెంట్ సర్వే తో పాటు, ప్రైవేటు ఏజెన్సీలతో ను సర్వే చేయించినట్లు సమాచారం.
అయితే ఈ సర్వేలో స్వరం రవి వైపు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లుగా రిపోర్ట్ అందడం తో ఆయనని హుజురాబాద్ అభ్యర్థిగా ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారట.
దాదాపు 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ లోనే ఉంటున్న రవి, హైదరాబాదులో ప్రముఖ పారిశ్రామికవేత్త గా ఉన్నారు.ఇటీవలే ఆయన ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిశారు.
ఈ సందర్భంగా టికెట్ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.బిసి సామాజిక వర్గానికి చెందిన స్వరం రవి ని ఎంపిక చేయడం ద్వారా, అదే సామాజిక వర్గం నుంచి తమకు ప్రత్యర్థిగా ఉన్న ఈటెల రాజేందర్ ను ఢీ కొట్టేందుకు అవకాశం ఉంటుందనేది కెసిఆర్ అభిప్రాయమట.
ఇప్పటికే టిఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు లిస్ట్ పెరుగుతూనే వస్తోంది.
కెసిఆర్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.ఇప్పుడు స్వరం రవి ఎంపిక చేస్తే సమీకరణాలు ఎలా ఉంటాయనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారు.వివిధ సర్వేల్లో ఆయనకు అనుకూలంగానే రిపోర్ట్ రావడంతో, పార్టీ నేతలతో చర్చించి ఆయన పేరును ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.