మంత్రుల కదలికలపై నిఘా ? ఎందుకో ఆ అనుమానం  

Kcr Secret Operation On Telangana Cabinet Ministers -

అనుమానం పెనుభూతం అంటారు.ఆ అనుమానానికి సరైన సమాధానం దొరికే వరకు కుదురు ఉంచదు.

Kcr Secret Operation On Telangana Cabinet Ministers

ఒకసారి అనుమానం వచ్చింది అంటే అది పగ వాడు, మనవాడు అనే తేడా ఉండదు.ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు కొంచెం గందరగోళంలో ఉండడం, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని స్పీడ్ చేయడం తదితర కారణాలతో నిఘా అధికారులకు పని ఎక్కువయ్యింది.

మొన్నటివరకు ఏపీ సీఎం జగన్ తన మంత్రి మండలి సభ్యులపై నిఘా పెట్టారనే వార్త సంచలనం రేపింది.ఇప్పుడు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రిమండలిపై కూడా నిఘా ఏర్పాటు చేసినట్టు వార్తలు వస్తుతండడంతో తెలంగాణ మంత్రుల్లో ఆందోళన మొదలయినట్టు సమాచారం.

మంత్రుల కదలికలపై నిఘా ఎందుకో ఆ అనుమానం-Political-Telugu Tollywood Photo Image

తమపై ప్రభుత్వం నిఘా పెట్టింది చూసారా ఈ దారుణం అంటూ కొంతమంది మంత్రులు తమ సహచరుల దగ్గర వాపోతున్నారట.

మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత ఇప్పటి వరకూ ఎవరూ కూడా మీడియా ముందుకు రావడం లేదు.టీవీ డిబేట్స్ లో కూడా కనిపించడంలేదు.ఇటీవలే ఓ కీలక శాఖ కు సంబందించిన మంత్రి గారు ఓ చానల్ ఇంటర్వ్యూకు వెళ్లాలని అనుకున్నారు.

దానికి తగ్గట్టే ఫలానా సమయానికి వస్తాను అంటూ మాట కూడా ఇచ్చారు.కానీ అనుకోకుండా ఉదయం మంత్రి పేషీ నుంచి సదరు జర్నలిస్టుకు ఫోన్ వెళ్లింది, మంత్రిగారూ ఇంటర్వ్యూకు రాలేరు అని సిబ్బంది సమాచారం ఇచ్చారు.

దీనిపై ఆరా తీస్తే ఏం తెలిసిందంటే సదరు టీవీ ఛానెల్ కార్యక్రమానికి మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటూ సీఎంవో నుంచి మంత్రిగారికి ఆదేశాలు జారీ అయ్యాయట.

ఈ నేపథ్యంలోనే మంత్రులందరికీ టీవీ డిబేట్లకు లేదా టీవీ ఇంటర్వ్యూలకు వెళ్లొద్దు అంటూ మరోసారి అందరికి సీఎంవో నుంచి ఆదేశాలు అందాయి.

అంతే కాదు ఈ మధ్య కాలంలో టీవీ డిబేట్లకు అధికార ప్రతినిధులను కూడా పంపించడంలేదు.ఇటు కేటీఆర్‌, హరీష్‌రావు, కవిత కూడా మీడియాకు చాలా దూరంగా ఉంటున్నారు.

ప్రగతిభవన్‌లో ఎప్పుడో ఒకసారి మీడియాకు ఎంట్రీ ఇస్తున్నారు.అంతా ప్రెస్ నోట్స్ ద్వారానే సమాచారాన్ని అందిస్తున్నారు.

మరోవైపు టీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా మీడియాకు ఆంక్షలు విధించారు.ఇక మంత్రుల కదలికలపై పూర్తి స్థాయి నిఘా పెట్టి మంత్రులు రోజు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ? అధికారిక కార్యక్రమాలు కాకుండా ఇతర కార్యక్రమాల్లో ఏమైనా పాల్గొంటున్నారా తదితర అన్ని విషయాలను నిఘా అధికారులు ఎప్పటికప్పు సీఎంవో కు చేరవేస్తున్నారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు