ఎక్కడా తగ్గేదే లేదంటున్న కేసీఆర్ !

తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆర్టీసీ సమ్మె పై పీటముడి ఇప్పట్లో వీడేలా కనిపించడంలేదు.ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఏదో ఒక పరిష్కార మార్గం వెతకాల్సిందిగా హైకోర్టు సూచించినా కేసీఆర్ మాత్రం సమ్మె విషయంలో కఠిన వైకిరినే అవలంభించాలనే ఆలోచనలో ఉన్నాడు.

 Kcr Saysnocompromise On Tsrtc-TeluguStop.com

హైకోర్టు స్పష్టమైన సూచనలు చేసిన నేపథ్యంలో కేసిఆర్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు.శనివారం ఉదయం 10 .౩౦ లోపు కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించండి అని హైకోర్టు శుక్రవారం సూచించింది.దాంతో శుక్రవారం రాత్రి ఆర్టిసి సమస్యలపై చర్చించేందుకు ఉన్నతాధికారులను కెసిఆర్ పంపించారు.

అక్కడ నుంచి వచ్చిన ఆదేశాలతో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ వర్మ, కమిషనర్ సందీప్కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రగతి భవన్ కు వెళ్లారు.

అయితే కేసీఆర్ తాజ్ కృష్ణ లో జరిగిన ఈ వివాహానికి వెళ్లారు.

కేసీఆర్ తిరిగి రాగానే సమీక్ష ఉంటుందని ఉన్నత అధికారులు ప్రగతి భవన్ లోనే వేచి చుసారు.కానీ కెసిఆర్ తాజ్ కృష్ణా నుంచి ప్రగతి భవన్ వచ్చి అధికారులతో మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయారు అనంతరం ఎలాంటి సమీక్ష లేదని అధికారులను తిరిగి వెళ్లిపోవాల్సిందిగా సీఎం సూచించారు.

కానీ సీఎం సమీక్ష రద్దు చేసుకోవడానికి కారణం ఉందని, అధికారులు చెబుతున్నారు.కార్మిక నాయకులతో చర్చలు జరిపి పరిష్కారం వెతుక్కోవాలని హైకోర్టు కేవలం సూచన మాత్రమే చేసిందని, కాబట్టి ఆ సూచనలను ఆదేశించడం అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు కేసీఆర్ కు ఏ మాత్రం ఇష్టం లేదని, ఒకవేళ కార్మిక సంఘాల డిమాండ్లకు ఒకసారి లొంగితే పరిపాలన పట్టు తప్పుతుందని, మిగతా వారు కూడా ప్రభుత్వాన్ని ఈ విధంగానే బ్లాక్ మెయిల్ చేస్తారని కేసీఆర్ భావిస్తున్నారట.

Telugu Tsrtc, Tsrtc Samme-Telugu Political News

  సమ్మె విషయంలో తమ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత వచ్చినా ఆర్టీసీ సమ్మె విషయంలో వెనకడుగు వేయకుండా కఠిన వైకిరితోనే ముందుకు వెళ్లాలని కేసీఆర్ చూస్తున్నట్టుగా అర్ధం అవుతోంది.ఇక హైకోర్టు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో విచారణను ఈ నెల 28కి వాయిదా వేయడాన్ని కూడా కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చూస్తున్నాడు.ఈ నెల 28 వరకు సమయం ఉంది కాబట్టి హడావుడి పడాల్సిన అవసరం ఏమి లేదని ధీమాగా కేసీఆర్ ఉన్నట్టు కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube