హైకోర్ట్ ప్రతిపాదనకు నో చెప్పిన కేసీఆర్

ఆర్టీసీ సమ్మె విషయంలో ఎవరు చెప్పినా వినేలా తెలంగాణ సీఎం కేసీఆర్ కనిపించడంలేదు.మొదటి నుంచి ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పై ఆగ్రహంగానే ఉన్న ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మెట్టు దిగేందుకు ఇష్టపడడంలేదు.

 Kcr Said No To The High Court Proposal-TeluguStop.com

ఫలితాలు ఎలా ఉన్నా ఫర్వాలేదు అన్నట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నాడు.ఇప్పటికే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కొంతమంది ఆయనకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఆర్టీసీ సమ్మె విషయంలో మీరెవరూ కలగజేసుకోవద్దని కేసీఆర్ తీవ్రంగా హెచ్చరికలు చేయడంతో వారంతా సైలెంట్ అయిపోయారు.

ప్రస్తుతం సమ్మె విషయంలో కాస్తా తెలంగాణ హైకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది.అయితే నిన్న సమ్మె విషయంలో హైకోర్టు ఓ కీలక సూచన చేసింది.

సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో ఒక కమిటీ వేసి ఈ సమస్యకు పరిష్కారం వెతుకుదామని సూచించింది.అయితే ఆ ప్రతిపాదన తమకు ఇష్టం లేదని ఏజీ ద్వారా ప్రభుత్వం హైకోర్టుకు తెలియచేసింది.

కార్మికులతో సంప్రదింపులు జరపడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, కార్మిక సంఘాల మొండి వైఖరి వల్ల సమ్మె వచ్చిందని ప్రభుత్వం వాదిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube