టీఆర్ఎస్ పరిస్థితి కష్టంగానే ఉందా ..?     2018-10-21   10:23:12  IST  Sai Mallula

తెలంగాణాలో తిరిగి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న టీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలించడంలేదు. అసెంబ్లీ రద్దుకు ముందే అనేక సర్వేలు చేయించిన కేసీఆర్ అప్పటి పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ముందస్తుకు వెళ్లారు. అయితే… ప్రస్తుతం ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై వ్యతికేత ఎక్కువగా కనిపిస్తుండం ఆ పార్టీ నాయకులకు మింగుడుపడడంలేదు. అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలోకి దిగిన టీఆర్ఎస్ కు అనుకోని వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏం చేసినా ఎక్కడకి వెళ్ళినా టీఆర్ఎస్ కు వ్యతిరేఖత వ్యక్తం అవుతుంది.

Kcr Review Meeting With TRS MLA Candidates-

Kcr Review Meeting With TRS MLA Candidates

ప్రజల్లో ఉన్న ఈ వ్యతిరేఖత పార్టీ మీదనా లేక వ్యక్తిగతమైన వ్యతిరేఖతనా అర్ధం కాని డైలమా పార్టీలో నెలకొంది. ఈ నేపథ్యంలో భయంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆదివారం మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు తెలంగాణ శాస‌న స‌భ్యుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం ఏర్పాటు చేయ‌బోతున్నారు. అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సరళి, స్థానిక ఇబ్బందులపై చర్చించి అందుకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధంచేసి పనిలో కేసీఆర్ ఉన్నారు.

Kcr Review Meeting With TRS MLA Candidates-

క్షేత్ర స్థాయిలో ప్ర‌భుత్వానికి, పార్టీ ప్ర‌తినిధుల‌కు ఎదుర‌వుతున్న వ్య‌తిరేక‌త‌కు కార‌ణం ఏంటీ…అస‌లు ఎందుకు వ్య‌తిరేక‌త వ‌స్తోంది. అభ్య‌ర్థులను వ్య‌తిరేకిస్తున్నారా.. లేక పార్టీనే వ్య‌తిరేకిస్తున్నారా… పార్టీని వ్య‌తిరేకిస్తే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి… అభ్య‌ర్థుల్నే వ్య‌తిరేకిస్తే ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాల‌నే దానిపై అభ్య‌ర్థుల‌తో కేసీఆర్ కూలంకషంగా చ‌ర్చించ‌నున్నారు.

టీఆర్ఎస్ ప్రచారంలో మహాకూటమి కంటే ముందుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హాకూట‌మి కారణంగా అభ్య‌ర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం కూడా అధికార టీఆర్ ఎస్ పార్టీకి బాగా క‌లిసి వ‌స్తోంది. దీన్ని అనుకూలంగా మార్చుకుని ప్ర‌జా క్షేత్రంలో హుషారెత్తించాల‌నే ఆలోచ‌న‌లో గుల‌బీ బాస్ వ్యూహాన్ని ర‌చించిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం నివురుగ‌ప్పిన నిప్పులా వున్న అస‌మ్మ‌తి రాగం తగ్గించటం గులాబీ బాస్ కు కూడా సాధ్యం కావటం లేదు. పార్టీపై , ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వున్న వ్య‌తిరేక‌త‌ను తెలివిగా త‌గ్గించి ఉద్య‌మ కాలంలో వాడిన వాడి వేడి ప్ర‌సంగాల‌ తరహాలో ఇప్పుడు కూడా ఎపీని తిడుతూ బాబును తిడుతూ ప్రసంగాలు చేసి మ‌ళ్లీ అధికారం చేజిక్కించుకోవాల‌న్న‌దే కేసీఆర్ ప్ర‌ధాన ఎత్తుగ‌డ‌గా కనిపిస్తోంది.