ఎన్నికల ముందు బాబుకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్!  

ప్రత్యేక హోదా విషయంలో క్లారిటీ ఇచ్చిన కేసీఆర్. .

Kcr Return Gift To Chandrababu-janasena,kcr Return Gift,tdp,trs,ysrcp

మరో రెండు రోజులలో ఏపీలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇక ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే అన్ని పార్టీలు తమ మాటల గారడీతో ప్రజలని మాయ చేసే ప్రయత్నం చేసాయి. అయితే ఇక తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగింపు దశకి వచ్చింది..

ఎన్నికల ముందు బాబుకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్! -KCR Return Gift To Chandrababu

ఇక ఏపీలో వైసీపీ పార్టీకి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని గతంలో కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఇక ఏపీపై కేసీఆర్ పెత్తనం చేస్తూ హైదరాబాద్ లో ఉన్న వ్యాపారస్తులని బెదిరించి వైసీపీ వైపు వెళ్ళేలా చేస్తున్నారని, అలాగే ఆంధ్రా వ్యాపారులని బెదిరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ, అలాగే వైసీపీకి ఓటు వేస్తే కేసీఆర్ కి పెత్తనం ఇచ్చినట్లే అని చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తూ ఆంధ్రా సెంటిమెంట్ తో లాభపడాలని చూస్తున్నారు.

అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా కేసీఆర్ అడ్డుపడతాడని చంద్రబాబు విమర్శలు చేసారు.

ఈ నేపధ్యంలో తాజాగా ఎపికి ప్రత్యేక హోదాపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ఏపీకి సహకరిస్తామని గతంలో పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎన్నోసార్లు చెప్పారని సీఎం తెలిపారు. మరోసారి తెలంగాణ గడ్డనుంచి చెబుతున్నాను ఏపీ ప్రత్యేక హోదాపై తామెప్పుడూ అడ్డుపడలేదని చెప్పారు.

ఈ విషయంలో తమ సంపూర్ణ మద్దతు ఏపీకి ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక కేసీఆర్ మాటల ద్వారా ఇప్పుడు చంద్రబాబుని కార్నర్ చేసే ప్రయత్నం చేసారు. మరి ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది చూడాలి..