పీఎం పర్యటనకు సీఎం కు నో ఎంట్రీ ? కేసీఆర్ ఖుషి ఖుషి ?  

హైదరాబాదులో గ్రేటర్ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతున్న సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదులో నేడు పర్యటించబోతుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వైరస్ వాక్సిన్ తయారు చేస్తుండటంతో, దాని పురోగతిని తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోది నేడు తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు.

TeluguStop.com - Kcr Relief On Prime Minister Modhi Tour

ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తారా లేదా అనేది పక్కన పెడితే, కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్ళాలి.అలా వెళ్ళినా, పార్టీపరంగా ఎటువంటి విమర్శలు రావు.

  ఎందుకంటే మోదీని తీవ్రంగా వ్యతిరేకించే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటివారే మోదీకి ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్నారు.కానీ ఇప్పుడు కెసిఆర్ వెళ్లాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు.

TeluguStop.com - పీఎం పర్యటనకు సీఎం కు నో ఎంట్రీ కేసీఆర్ ఖుషి ఖుషి -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారు అయినప్పటి నుంచి , ఇదే రకమైన ఉత్కంఠ నెలకొంది.బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సమయంలోనే ప్రధాని హైదరాబాద్ లో అడుగు పెట్టడం అంటే టిఆర్ఎస్ కు కాస్త ఇబ్బందికర పరిణామమే.

ఒకవేళ వెళ్లకపోతే ప్రోటోకాల్ సమస్యలతో పాటు అనేక రాజకీయ విమర్శలు వస్తాయనే భయంతో ఇప్పటి వరకు కేసీఆర్ ఉండగా , ఇప్పుడు ప్రధాని కి స్వాగతం పలికేందుకు, ఆయన పర్యటనలో పాల్గొనేందుకు రానవసరం లేదని, స్వయంగా ప్రధాని మోదీ వ్యక్తిగత కార్యదర్శి, తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేశారని, ఎలా స్వాగతం పలకాలి ఎవరెవరికి అనుమతి ఉందో వంటి అన్ని విషయాలను చెప్పారని, ప్రధాని పర్యటన లో ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతి ఉందని అధికారులు చీఫ్ సెక్రటరీకి చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక ఈ పర్యటనకు గవర్నర్ కూడా వెళ్లడం లేదు.

ఈ వార్త తెలిసిన వెంటనే కేసీఆర్ మరింత ఖుషి అయ్యారని, ఇప్పటివరకు ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్న తమకు పి ఎం కార్యాలయం మంచి చల్లటి వార్త చెప్పిందని కెసిఆర్ ఆనందంలో ఉన్నారట.ఎందుకంటే ఈ రోజు ఎల్బీ స్టేడియం కేసీఆర్ర్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.

ఈ సభ జరిగే సమయం, ప్రధాని మోడీ తెలంగాణలో అడుగుపెట్టే సమయం ఇంచుమించుగా ఒకటే కావడంతో , ఈ సభ లో పాల్గొనాలా,  ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లాలా, అనే విషయంలో కేసీఆర్ కు క్లారిటీ లేకుండా పోయింది.వాస్తవంగా కేంద్ర బిజెపి పెద్దలతో కేసీఆర్ సన్నిహితంగా ఉండేవారు.

అయితే కొంతకాలంగా రెండు పార్టీల కు మధ్య వైరం పెరగడం తో రాజకీయ బద్ద శత్రువులు గా మారిపోయారు.

#GHMC #Bharat Biotech #Telangana #Elections

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు