హిట్ లిస్ట్ రెడీ ... వారిపైనే కేసీఆర్ గురి       2018-07-07   01:56:01  IST  Bhanu C

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు సాధారణంగా ఎవరికీ అర్ధం కావు. కానీ ఆయన ఒక టార్గెట్ పెట్టుకుంటే అది కచ్చితంగా పూర్తి చేసినందుకు వెనుకా ముందు ఆడారు. కేసీఆర్ రాజకీయాలు కూడా అలాగే ఉంటాయి. తాను నమ్మిన వారి కోసం ఏమి చేయడానికైనా వెనుక ముందు ఆడరు. ఆ విషయం అందరికి బాగా తెలుసు. ఇక వచ్చే ఎన్నికల్లో పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చేందుకు కేసీఆర్ చాలా కాలంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటూనే ఉన్నాడు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అనేక ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు పార్టీని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే సమయంలో తనకు కంట్లో నలుసులా తయారయిన కొంతమంది నాయకులను కూడా కేసీఆర్ టార్గెట్ చేసుకున్నాడు.

వివిధ సర్వేల ద్వారా ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్న కేసీఆర్ ఆ సర్వ్ రిపోర్టులు ప్రస్తుతం పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు రావడంతో ముందస్తు ఎన్నికలు వస్తే బాగుండును అని ఎదురుచూపులు చూస్తున్నాడు. ఇటీవల కేంద్రం నియమించిన లా కమిషన్ జమిలి ఎన్నికలపై తన అభిప్రాయం అడగగా తనకు ఒకే అని చెప్పేసాడు.
ఇటీవల కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకంతో రాష్ట్రంలో తమ పాలన విషయంలో సానుకూలంగా ఉన్నట్లుగా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే.. ఆలస్యం కాకుండా.. వాతావరణం తమకు అనుకూలంగా ఉన్న సమయంలో ఎన్నికలు జరిగితే మంచిదన్న ఆలోచనలో ఉన్నారు.

ఇదే సమయంలో తమకు ఇబ్బంది కలిగించే విపక్ష నేతలకు సంబంధించి 20 మంది పేర్లను కేసీఆర్ రెఢీ చేసినట్లుగా చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. విపక్షాలకు చెందిన ముఖ్య నేతల ఓటమే తన లక్ష్యమన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు.
ఇంతకీ ఆ లిస్ట్ లో ఉన్న నేతలపై కేసీఆర్ ఎందుకు అంత పాగా పెంచుకున్నాడు అంటే మాత్రం ఎవరూ స్పందించడంలేదు. ఇప్పుడిప్పుడు ఎన్నికలు వచ్చినా తమకు 100కు పైగా సీట్లు ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ కేసీఆర్ లిస్ట్ లో ఉన్న నేతలు ఎవరో తెలుసా ..? ఈ కింద లిస్ట్ లో ఉన్నవారే.

1. జానారెడ్డి – నాగార్జునసాగర్
2. ఉత్తమ్ కుమార్ – హుజూర్ నగర్
3. పద్మావతి- కోదాడ
4. కోమటిరెడ్డి- నల్లగొండ
5. మల్లు భట్టి విక్రమార్క- మధిర
6. జీవన్ రెడ్డి- జగిత్యాల
7. రామ్మోహన్రెడ్డి- పరిగి
8. డీకే అరుణ- గద్వాల
9. వంశీచంద్ రెడ్డి- కల్వకుర్తి
10. సంపత్ కుమార్- అలంపూర్
11. రేవంత్ రెడ్డి- కొడంగల్
12. దొంతి మాధవరెడ్డి- నర్సంపేట
13. సండ్ర వెంకటవీరయ్య- సత్తుపల్లి
14. గీతారెడ్డి- జహీరాబాద్
15. లక్ష్మణ్- ముషీరాబాద్
16. జి.కిషన్ రెడ్డి- అంబర్పేట
17. రామచంద్రారెడ్డి- ఖైరతాబాద్
18. ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్- ఉప్పల్
19. రాజాసింగ్- గోషామహల్
20. సున్నం రాజయ్య- భద్రాచలం