ఎప్పుడూ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ, ఏదో ఒక హడావుడి చేస్తూ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తన హవా చూపిస్తూ ఉంటారు తెలంగాణ సీఎం కేసీఆర్.ఇక మంత్రివర్గంలోనూ కేసీఆర్ వీరవిధేయులకు మాత్రమే అవకాశం కల్పించారు.
అయితే ఎక్కడా మంత్రుల పెత్తనం పార్టీలోనూ, ప్రజల్లోనూ లేకుండా కేవలం మొత్తం .అన్ని వ్యవహారాల్ని కేసీఆర్, కేటీఆర్ ఇద్దరే చూస్తున్నారు.ఇక చాలాకాలంగా తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి.అంతే కాదు చాలామంది మంత్రుల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని, ఇప్పుడు ఉన్న మంత్రుల్లో చాలామందిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రుల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తితో ఉండడంతో మొత్తం మంత్రుల పనితీరుపై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా, తన సహచరుల పనితీరుపై ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు ప్రైవేటు సంస్థల నుంచి నివేదికలు తెప్పించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రుల పనితీరు ఆధారంగా ఏ, బీ,సీ,డీ గ్రేడులు ఏర్పాటు చేసినట్టు సమాచారం.ఇదే విషయాన్ని ప్రగతి భవన్ వర్గాలు కూడా దృవీకరిస్తున్నాయి.ఈ గ్రేడ్లను ఆధారంగా చేసుకుని మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన తప్పదని తెలంగాణ భవన్ లో ప్రచారం జరుగుతోంది.మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సహా పాటు మరో ఐదుగురు పదవులకు ఎటువంటి ఇబ్బంది లేనట్టుగా తెలుస్తోంది.
నెల రోజుల క్రితం వరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది.అయితే అనూహ్యంగా కరోనా వైరస్ ఎఫెక్ట్ తో పాటు ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మంత్రి పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో అసంతృప్తితో ఉండడంతో మంత్రి ఈటెల రాజేందర్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.దీంతో ఈటెల పై వేటు తప్పదని అంతా భావించారు.
అకస్మాత్తుగా కరోనా వైరస్ ఎఫెక్ట్ తో మంత్రి ఈటెల పనితీరుపై కేసీఆర్ సంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ తరువాత నుంచి ఈటెల నిత్యం విరామం లేకుండా, నిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈటెల మంచి పేరు సంపాదించుకున్నారు.
అంతే కాదు కరోనా వైరస్ సోకింది అని అనుమానం ఉన్న వ్యక్తులతో కూడా ఈటెల నేరుగా మాట్లాడడం కూడా కేసీఆర్ కు బాగా నచ్చిందట.

ఇక మరో మంత్రి పువ్వాడ అజయ్ విషయంలోనూ ఇదేవిధంగా కేసీఆర్ అభిప్రాయం ఉందట.ఆర్టీసీ సమ్మె సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారని, సంస్థను లాభాల బాటలో పట్టించడానికి పువ్వాడ తీవ్ర స్థాయిలో కస్టపడడం కూడా కేసీఆర్ కు సంతృప్తి కలిగిస్తోందట.ఇక కేసీఆర్ కుమార్తె కవితను ఎమ్యెల్సీ ని చేస్తున్న నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
అయితే నలుగురు ఐదుగురు మంత్రి పదవులకు ముప్పు ఏర్పడడం, వీర విధేయులకు మంత్రి పదవులు దక్కడం ఖాయం అయ్యే అవకాశం కనిపిస్తోంది.