లిస్ట్ ఫైనల్ చేసేస్తున్నారా ? కేసీఆర్ దయ ఎవరి మీదో ?

టిఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ సందడి ఎక్కువగా కనిపిస్తోంది.రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో సభ్యత్వం ఆశిస్తున్న నాయకులు అంతా తీవ్ర స్థాయిలో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

 Kcr Prepare The Final List Of Rajya Sabha Seat Lists-TeluguStop.com

సీఎం కేసీఆర్ ఎవరెవరికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలనే విషయంపై ఒక స్పష్టమైన క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.ఇప్పటికే కెసిఆర్ కుమార్తె కవిత, మరొకరి పేరు ఫైనల్ అయినట్లుగా ప్రచారం జరిగినా అటువంటిదేమీ లేదని పార్టీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.

ఇక బిసి, ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం అవకాశం లేనట్టుగా ప్రచారం జరుగుతోంది.టిఆర్ఎస్ కు రెండు రాజ్యసభ స్థానాల దక్కబోతున్నాయి.

సుమారు పది మంది వరకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

Telugu Jagankcr, Kavitha, Kcrprepare, Rajya Sabha, Vinodh Kumar-Political

గతంలో సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసిన కెసిఆర్ ఇప్పుడు మాత్రం నమ్మకస్థులు, వీరావేద్యులకు మాత్రమే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం రాజ్యసభ రేసులో ఎక్కువగా వినిపిస్తున్నపేరు కేసీఆర్ కుమార్తె కవిత.గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వినోద్ కుమార్, అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

పార్లమెంట్ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీనివాసరెడ్డికి కాకుండా టిడిపి నుంచి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావుకు ఇవ్వడంతో ఈసారి రాజ్యసభ సభ్యత్వం తప్పకుండా కేసీఆర్ ఇస్తారని, ఈ విషయంలో జగన్ కూడా కెసిఆర్ కు సిఫార్స్ చేయడంతో తనకే రాజ్యసభ సభ్యత్వం వస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు.

Telugu Jagankcr, Kavitha, Kcrprepare, Rajya Sabha, Vinodh Kumar-Political

ప్రస్తుతం ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగా కేసీఆర్ మాత్రం అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇప్పటికే తయారు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.ఇక కేసీఆర్ కుమార్తె రాజ్యసభ రేసులో లేరని ప్రచారం జరుగుతున్నా కేసీఆర్ మాత్రం ఆమెను ఒప్పించారని ఆమె పేరు ఫైనల్ అయినట్టుగా కూడా తెలుస్తోంది.

తనతో పాటు కవితను కూడా జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ చేసి తెలంగాణను పూర్తిగా కేటీఆర్ కు అప్పగించాలని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.అందుకే రాజ్యసభ సభ్యత్వాలను ప్రకటించి ఆ తరువాత కేటీఆర్ ను సీఎంగా చేసే విషయమై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube