ఆ నిర్ణయాన్ని వాయిదాలు వేస్తున్న కేసీఆర్ ? మంత్రుల్లో ఆనందం ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా, దానికి ఒక లెక్క ఖచ్చితంగా ఉంటుంది.తనకు తమ పార్టీకి తమ ప్రభుత్వానికి మేలు జరిగితే ఏదైనా చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు.

 Telangana, Trs ,telangana Cm, Kcr, Ktr ,huzurabad, Elections , Rajendra ,telanga-TeluguStop.com

హుజూరాబాద్ ఎన్నికల వ్యవహారంలో చాలా బిజీ గానే కెసిఆర్ ఉన్నారు.ఆ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందిస్తూ, ఈటెల రాజేందర్ హవా పెరగకుండా చేసేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు.

అయితే కేసీఆర్ గత కొంత కాలంగా ఓ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు.కెసిఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారు అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం అనేక విమర్శలు ఎదుర్కొంటున్న నలుగురైదుగురు మంత్రులను తప్పించి ,వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటారని ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది.

అయితే దానికి తగ్గ పరిస్థితులు ఏర్పడకపోవడం తో కేసీఆర్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.

ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికలపైనే కెసిఆర్ ఫోకస్ పెట్టారు.ఆ ఎన్నికలు ముగిసేంత వరకు మంత్రివర్గ విస్తరణ జోలికి వెళ్లే సాహసం చేసే కనిపించడం లేదు.

వాస్తవంగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తి కాగానే,  మంత్రివర్గాన్ని విస్తరిస్తారు అని కెసిఆర్ చూసినా, ఆ తర్వాత ఈటల రాజేందర్ వ్యవహారం  చోటుచేసుకోవడంతో  సైలెంట్ అయిపోయారు.ఇక అనూహ్యంగా రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించడం, ఆయన ఎమ్మెల్యే పదవికి , పార్టీకి రాజీనామా చేయడం,  బీజేపీలో ఆయన చేరడం తదితర పరిణామాలతో ఇప్పుడు ఎన్నికలు అనివార్యమయ్యాయి .దీంతో ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకు మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కెసిఆర్ ఏ మాత్రం విస్తరించేందుకు ఇష్టపడడంలేదు.ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం మంత్రులో ఆనందాన్ని నింపుతున్న కెసిఆర్ ఎవరిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారో తెలీదు.

Telugu Huzurabad, Malla, Rajendra, Telangana, Telangana Cm-Telugu Political News

ఇప్పటి వరకు టెన్షన్ గా ఉన్నారు .కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్, మంత్రి మల్లారెడ్డి తదితరులను తప్పిస్తారు అనే ప్రచారం జరిగింది.అయితే ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల కు కమలాకర్ కీలకం అవ్వడం తో, ఆయన విషయంలో ఏం చేస్తారు అనేది తేలాల్సివుంది.ఇక మిగతా మంత్రుల లో కొంతమంది పేర్లు తప్పించే జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా,  ఇప్పట్లో కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం లేదని సమాచారం మంత్రులు అందరిలోనూ ఆనందాన్ని కలిగిస్తోందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube