కేసీఆర్ రాజకీయం ఇలాగే ఉంటుంది మీకే అర్ధమవుతోందా ?  

Kcr Politics Economic Package - Telugu Big Bogus, Economic Package, Kcr Slams Modi On Financial Package, Narendra Modi, Telangana Cm Kcr

కేసీఆర్ తో వ్యవహారం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.ఆయనకు ఎప్పుడు ఎవరు నచ్చుతారో, ఎప్పుడు ఎవరు విరోధులు అవుతారో చెప్పలేము.

 Kcr Politics Economic Package

ఆయనతో రాజకీయం అంటేనే ఎలా ఉంటుంది.ఇక బిజెపి విషయంలోనూ కేసిఆర్ వ్యవహరిస్తున్న తీరు ఇదే రకంగా చిత్ర విచిత్రంగా ఉంటూ వస్తోంది.

అసలు కేసీఆర్ తమ పార్టీకి శత్రువో, మిత్రుడు అన్న స్పష్టత బిజెపి నాయకులకు, టిఆర్ఎస్ నాయకులకు కరువయ్యింది.ఇక కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభించడంతో ఎక్కడి వ్యవహారాలు అక్కడే నిలిచిపోయాయి.

కేసీఆర్ రాజకీయం ఇలాగే ఉంటుంది మీకే అర్ధమవుతోందా -Political-Telugu Tollywood Photo Image

అయితే ఈ సమయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కేసీఆర్ తీవ్ర ప్రశంసలు కురిపించారు.మొదట్లో బీజేపీపై ఇతర పార్టీల నాయకులు విమర్శలు చేస్తుండడంతో కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ సమయంలో కేంద్రానికి మద్దతుగా ఉండకుండా ప్రధానిపై చిల్లర వ్యాఖ్యలు చేస్తే కేసులు కూడా పెడతామంటూ కేసీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర బిజెపి పెద్దలను అదేపనిగా పొగుడుతూ మాట్లాడారు.

అయితే లాక్ డౌన్ 3, 4 దగ్గరకు వచ్చే సరికి కేసీఆర్ స్వరం లో స్పష్టమైన మార్పు కనిపించింది.కేంద్రం రాష్ట్రాలకు భారీగా ఆర్థిక ప్యాకేజీ ఇస్తుందని కేసీఆర్ ఆశలు పెట్టుకోగా, దానికి భిన్నంగా కేంద్రం వ్యవహరించింది.20 లక్షల కోట్ల బడ్జెట్ అంటూ గొప్పగా ప్యాకేజీ ప్రకటించినా దాంట్లో రాష్ట్రాల పాత్ర పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో చాలా రాష్ట్రాలతో పాటు కేసీఆర్ కూడా ఇప్పుడు బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

అంతేకాకుండా తమ ప్రభుత్వంపై అడుగడుగునా విమర్శలు చేస్తూ, ఏపీ బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపైన కేసీఆర్ గుర్రుగా ఉన్నారు.బీజేపీకి అనుకూలంగా తాను మాట్లాడితే, అది ఏపీ బిజెపి నాయకులు అనుకూలంగా మార్చుకుని రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉందని ముందే గ్రహించిన కేసీఆర్ బీజేపీపై గొంతు పెంచి మాట్లాడుతున్నారు.కేంద్రం తీసుకురాబోతున్న విద్యుత్ సంస్కరణల బిల్లును సైతం తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తుంది అనుకుంటే ముష్టి వేసినట్లుగా కేంద్రం వ్యవహరించిందని కేసిఆర్ ఇప్పుడు ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

అసలు బీజేపీ విషయంలో కేసీఆర్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియక బీజేపీ నేతలు సతమతం అయిపోతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు