Pawan Kalyan KCR : కేసీఆర్ పీఎం పవన్ కళ్యాణ్ సీఎం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్లెక్సీ!

దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.బలమైన ప్రతిపక్షాలు లేకపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో సంవత్సరాల తరబడి కొందరే సీఎంలు అవుతూ ప్రజలను పాలిస్తున్నారు.

 Kcr Pm And Pawan Kalyan Cm Flexi Goes Viral In Social Media Details Here Goes Vi-TeluguStop.com

ఈ నేతల విషయంలో ప్రజల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉన్నా మరో ఆప్షన్ లేక ప్రజలు సైతం కొన్ని పార్టీలనే గెలిపిస్తున్నాయి.అయితే అవినీతి లేకుండా రాజకీయ నేతలు పాలించాలని ప్రజలు మాత్రం ఆశిస్తున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయ దిశగా నిర్ణయాలు తీసుకుంటుండగా రాబోయే రోజుల్లో ఆయన ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. బీ.ఆర్.ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో తెలుగోడి పవర్ చూపించాలని కేసీఆర్ భావిస్తున్నారు.త్వరలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బీ.ఆర్.ఎస్ పార్టీకి మరింత మంచి గుర్తింపు వచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రణాళికలు సైతం సిద్ధమయ్యాయని సమాచారం.

Telugu Brs, Guntur, National, Pawan Kalyan, Tenali-Movie

మరోవైపు ఏపీలో ఒక్క ఛాన్స్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు.తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్ర రాజకీయాల్లొ విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తానని పవన్ భావిస్తున్నారు.ప్రస్తుతం జనసేన బీజేపీతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.ప్రధాని మోదీ సైతం బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు నమోదవుతాయని సూచనలు చేసినట్టు సమాచారం.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కేసీఆర్ పీఎం పవన్ కళ్యాణ్ సీఎం అంటూ వైరల్ అవుతున్న ఫ్లెక్సీ హాట్ టాపిక్ అవుతోంది.గుంటూరు జిల్లా తెనాలి కొలకలూరుకు చెందిన కేసీఆర్, పవన్ అభిమాని అయిన గద్దె గోపాల కృష్ణమూర్తి ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

వైసీపీ అభిమానులు ఈ ఫ్లెక్సీ గురించి ఎలా స్పందిస్తారో చూడాలి.కేసీఆర్ పీఎం పవన్ సీఎం కావాలని కోరుకుంటున్న ఈ అభిమాని కోరిక రాబోయే రోజుల్లో నిజమవుతుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube