కేసీఆర్ ఎత్తు ... ప్రత్యర్థి పార్టీల చిత్తు !

తెలంగాణలో తిరుగులేని అధికారం దక్కించుకున్న టిఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళుతోంది.మరో ఐదేళ్ల పాటు తమకు ఎదురు లేకపోవడంతో ఉన్న కొంతమంది ప్రత్యర్థులను కూడా తమ దారికి తెచ్చుకుని… ఆ తర్వాత ఎన్నికల్లో కూడా తమకు తిరిగే లేకుండా ఏకచత్రాధిపత్యం సాధించేందుకు గులాబీ బాస్ కొత్త ఎత్తులు వేస్తున్నాడు.

 Kcr Plays Important Role In Telangana Politics-TeluguStop.com

ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కొంతమంది కీలక నాయకులను పార్టీలోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పేసాడు.అలాగే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు అడ్డు లేకుండా చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.

దీనిలో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి… సుధీర్ రెడ్డి ఇలా అనేక మంది నాయకులకు పదవులు ఆశ చూపి పార్టీలో కి ఆహ్వానిస్తున్నాడు.వీరు రేపో మాపో టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు.అంతే కాకుండా… పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఎలాగు…కాంగ్రెస్ కీలక నాయకులంతా కారు ఎందుకు సిద్ధం అయినట్టు కనిపించడంతో… ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీనే.ఆ పార్టీకి ప్రస్తుతం పెద్దగా బలం లేకపోయినా…టీఆర్ఎస్ పార్టీ మాత్రం టీడీపీనే ప్రధాన ప్రత్యాదిగా భావిస్తోంది.అందుకే ఇప్పుడు తెలుగుదేశంలో కీలకంగా ఉన్న నాయకుల మీద కేసీఆర్ ప్రధాన దృష్టి పెట్టాడు.

తెలంగాణాలో పోటీ చేసిన టీడీపీ రెండంటే రెండు సీట్లు గెలుచుకుంది.సత్తుపల్లి లో సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావు పేట లో మచ్చా నాగేశ్వరరావు.వీరిని టీఆర్ఎస్ లోకి తీసుకు వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు కేసీఆర్.దీనిలో భాగంగానే… మిషన్ భగీరథ కు ఛైర్మెన్ పదవిని టిడిపి ఎమ్యెల్యే సండ్ర వీరవెంకటయ్యకు, మెచ్చా నాగేశ్వర రావు కు గిరిజన ఆర్ధిక సంస్థకు చైర్మెన్ పదవులు ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకారం కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాను టీడీపీ ని వీడేది లేదు అంటూ… మెచ్చా నాగేశ్వర రావు అమరావతి వెళ్ళి మరీ చంద్రబాబు దగ్గర చెప్పాడు.కానీ ఆయన మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరగడంతో….

పార్టీ మారడం తప్పనిసరి అన్నట్టు అయిపొయింది.వీరిద్దరూ పార్టీ మారేవరకు విడిచిపెట్టకుండా నయానో.

భయానో తమ దారికి తెచ్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube