కేసీఆర్‌ వ్యూహంతో విమానం కన్నా స్పీడ్‌గా దూసుకు పోతున్న కారు  

Kcr Plan Trs Win Telangana Muncipality Elections-kcr Telangana Cm,telangana Muncipal Elections,trs Ministers And Mla\\'s Focus On Telangana Muncipal Elections

తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే ఫలితాలపై ఒక స్పష్టత వచ్చింది.రాష్ట్రంలోని మెజార్టీ మున్సిపాలిటీల్లో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ జెండా పాతింది.కీలకమైన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీలను సైతం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది.

KCR Plan TRS Win Telangana Muncipality Elections-Kcr Cm Telangana Muncipal Elections Trs Ministers And Mla\\'s Focus On

మొత్తం 120 మన్సిపాల్టిలు మరియు 9 కార్పోరేషన్‌లలో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయ దుందుబీ మోగిస్తుంది.

ఎన్నికలకు ముందు రెండు మూడు సార్లు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మరియు మంత్రులను పిలిపించుకుని సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చారు.

మీకు అప్పగించిన మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి పాలయితే మీకు రాజకీయ భవితవ్యం ఉండదు.మీకు ఈ ఎన్నికలు చావో రేవో అంటూ హెచ్చరించడంతో చాలా మంది ఎమ్మెల్యేలు మరియు మంత్రులు కంటికి నిద్ర లేకుండా కష్టపడ్డారు.

అభ్యర్థుల ఎంపిక విషయం నుండి ఓటింగ్‌ రోజు వరకు చాలా కష్టపడ్డారు.ఇప్పుడు ఆ ఫలితమే ఈ రిజల్ట్‌ అంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు.

అలా కేసీఆర్‌ వ్యూహంతో కారు చాలా స్పీడ్‌గా దూసుకు పోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

Kcr Plan Trs Win Telangana Muncipality Elections-kcr Telangana Cm,telangana Muncipal Elections,trs Ministers And Mla\\'s Focus On Telangana Muncipal Elections Related....