తెలంగాణలో మరో ఎన్నికల పండగకి రంగం సిద్ధం  

తెలంగాణలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకి రంగం సిద్ధం. .

Kcr Plan To Zptc And Mptc Elections-kcr,telangana Government,trs,zptc And Mptc Elections

  • తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిపోయాయి. ఇక త్వరలో మరో ఎన్నికల సమరం మళ్ళీ మొదలుకాబోతుంది.

  • తెలంగాణలో మరో ఎన్నికల పండగకి రంగం సిద్ధం-KCR Plan To ZPTC And MPTC Elections

  • మళ్ళీ నాయకులు హైదరాబాద్ ని వదిలి జిల్లాలకి పరుగులు పెట్టాల్సిన అవసరం వచ్చింది. మే నెలలో జిల్లా పరిషత్ తో పాటు మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • ఇప్పటికే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకి తాము సిద్ధం అని కేసీఆర్ సంకేతాలు ఇచిన నేపధ్యంలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.

    మే నెలలో మూడు దశల్లో MPTC, ZPTC ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

  • మే 6, మే 10, మే 14 తేదల్లో పరిషత్ ఎన్నికలు జరపడానికి గణ ఎన్నికల షెడ్యూల్‌ని ప్రభుత్వానికి అందచేసినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మూడు దశల్లోనూ ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఎన్నికల ప్రకటన వెలువడే రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుందని సమాచారం.