జిల్లా చైర్మన్ లని ఫైనల్ చేస్తున్న కేసీఆర్! ఎన్నికలకి ముందే గెలుపుపై ధీమా  

జేపీ ఎన్నికలలో క్లీన్ స్వీప్ పై ద్రుష్టి పెట్టిన కేసీఆర్..

Kcr Plan To Win In Zp Elections-

తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాయి.ఇక త్వరలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకి రంగం సిద్ధం అయ్యింది.ఈ సారి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటం వలన, అలాగే ప్రధాన ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేకపోవడంతో ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది..

Kcr Plan To Win In Zp Elections--KCR Plan To Win In ZP Elections-

ఎ విధంగా చూసుకున్న టీఆర్ఎస్ పార్టీ నే స్థానిక సంస్థలు కైవసం చేసుకుంటుంది అని అందరూ భావిస్తున్నారు.ఇదిలా ఉంటే కేసీఆర్ కూడా ఈ ఎన్నికలని ప్రతిసాత్మకంగా తీసుకొని క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇక కేసీఆర్ ఎన్నికల వ్యూహంలో భాగంగా జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్ధులని కూడా ఖారారు చేస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలలో వినిపిస్తుంది.

టీఆర్‌ఎస్‌లో సీనియర్లకు పదవుల పంపకంపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా ముఖ్య నేతలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.అసెంబ్లీ ఎన్నికలలో సీట్లు రాని వారికి పోటీ చేసి ఓడిన వారిలో కొందరికి జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా అవకాశం ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత కసరత్తు చేస్తున్నారు.ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా.

మిగిలిన జిల్లాల విషయంలోనూ ఇదే తరహాలో ముందుకి వెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపే వీలైనన్ని ఎక్కువ జెడ్పీలకు చైర్మన్‌ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారు.