టీఆర్‌ఎస్‌ తిరుగుబాటుదారులకు అధిష్టానం బుజ్జగింపులు  

Kcr Phone Calls To Who The Leaders Are Opposite In Trs Party-kcr Cabinet Ministers,pragathi Bhavan,telangana Cm Kcr

కేసీఆర్‌ తాజాగా తన మంత్రి వర్గంను విస్తరించిన విషయం తెల్సిందే.ఆరుగురికి కొత్తగా తన మంత్రి వర్గంలో ఛాన్స్‌ ఇచ్చాడు.దీంతో మంత్రి పదవులు రాని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు...

Kcr Phone Calls To Who The Leaders Are Opposite In Trs Party-kcr Cabinet Ministers,pragathi Bhavan,telangana Cm Kcr-KCR Phone Calls To Who The Leaders Are Opposite In TRS Party-Kcr Cabinet Ministers Pragathi Bhavan Telangana Cm Kcr

నాయిని, రాజయ్య, రామన్న ఇంకా కొందరు పార్టీ ముఖ్య నేతలు ఇటీవల మాట్లాడుతూ బయటి పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాముఖ్యత ఇస్తూ మొదటి నుండి ఉన్న వారికి అన్యాయం చేస్తున్నారు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగింది.మొదటి సారి ఈ స్థాయిలో టీఆర్‌ఎస్‌ నాయకుల నుండి అసమ్మతి వినిపించడంతో వెంటనే రంగంలోకి దిగిన టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం బుజ్జగింపులకు సిద్దం అయ్యింది.ప్రగతి భవన్‌ నుండి అసమ్మతి వ్యాఖ్యలు చేసిన నాయకులకు ఫోన్‌ కాల్స్‌ వెళ్లినట్లుగా తెలుస్తోంది.

కొందరితో కేసీఆర్‌, కొందరితో కేటీఆర్‌ మాట్లాడి శాంతింప జేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది.అందరికి పదవులు రావడం అనేది కష్టం.పరిస్థితులు మరియు ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది.

Kcr Phone Calls To Who The Leaders Are Opposite In Trs Party-kcr Cabinet Ministers,pragathi Bhavan,telangana Cm Kcr-KCR Phone Calls To Who The Leaders Are Opposite In TRS Party-Kcr Cabinet Ministers Pragathi Bhavan Telangana Cm Kcr

పార్టీ కోసం పని చేసే ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరుగకుండా చూస్తాం.భవిష్యత్తులో తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అంటూ బుజ్జగించినట్లుగా తెలుస్తోంది.ఈ బుజ్జగింపులతో పలువురు అసమ్మతి నాయకులు తమ స్వరం మార్చుకున్నారు.

ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రం అసమ్మతితో రగిలి పోతూనే ఉన్నారు.