త్వరలోనే యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవం.. రాష్ట్రపతి, ప్రధాన ఆహ్వానo

యాగాలు, యజ్ఞాలు చెయ్యడంలో కే‌సి‌ఆర్ ఎప్పుడు ముందు ఉంటాడు.తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పురాణాలల్లో ఎవరికి తెలియని, సాధ్యం కానీ యజ్ఞాలను నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

 త్వరలోనే యాదాద్రి ఆలయం ప్రార�-TeluguStop.com

యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి ఆలయం పనులు ఫిబ్రవరి లేదా మార్చిలో పూర్తి అవ్వుతుంది కావున కే‌సి‌ఆర్ అక్కడ సుదర్శన యాగంతో పాటు చండీయాగం, రాజశ్యామలయాగంలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.యదాద్రి ఆలయ ప్రారంభోత్సవం నాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు ముఖ్యనాయకులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అతిదులుగా రానున్నారు.

అందుకు సంబందించిన ఏర్పాట్లలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం తర్వాత ఆయన తెలంగాణ సి‌ఎం కుర్చి నుండి తప్పుకొని తన కొడుకు కే‌టి‌ఆర్ కు బాధ్యతలు అప్పగిస్తాడని విశ్వసనియ సమాచారం.

కే‌సి‌ఆర్ కి మొదటి నుండి కూడా సెంటిమెంట్స్ ఎక్కువ అందుకే యాదాద్రి ఆలయం పూర్తి అయిన తర్వాతే కే‌టి‌ఆర్ కి పట్టాభిషేకం చెయ్యనున్నాడు.సంక్రాంతి లోగా కే‌టి‌ఆర్ సి‌ఎం అవ్వుతాడనే వార్తలు వచ్చాయి కానీ కే‌సి‌ఆర్ నుండి ఏలాంటి ప్రకటన మాత్రం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube