ద‌ళిత బంధుపై కేసీఆర్ ఓపెన్ కామెంట్స్‌.. భ‌గ్గుమంటున్న ప్ర‌తిప‌క్షాలు..!

తెలంగాణ రాజ‌కీయాలు రోజురోజుకూ సంచ‌ల‌నం రేపుతున్నాయి.ఇప్ప‌టికే హుజూరాబాద్ వేదిక‌గా చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.

 Kcr Open Comments On Dalit Relatives  Falling Opposites Kcr, Politics, Ts Poltic-TeluguStop.com

ఇక ఇందులో భాగంగానే కేసీఆర్ ఎంతో ప్లాన్ వేసి మ‌రీ హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌కుని ప్ర‌చారం చేస్తున్న కౌశిక్ రెడ్డిని టీఆర్ ఎస్ లో చేర్చుకున్నారు.అయితే కౌశిక్ రెడ్డి చేరిక సందర్భంగా కేసీఆర్ ఎన్నో విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ఆయ‌న‌కు మంచి ప‌ద‌వి ఇస్తామంటూ చెప్ప‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇదే క్ర‌మంలో ఆయ‌న ఎన్నో అనుమానాలు వ‌స్తున్న ద‌ళిత బంధుపై కూడా సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

ద‌ళిత బంధును ఎన్నిక‌ల కోస‌మే పెట్టామ‌ని, ఓట్ల కోస‌మే స్కీములు పెడ‌తామంటూ చెప్ప‌డం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తి ఇంత ఓపెన్‌గా ఓట్ల కోసం స్కీములు పెడ‌తామ‌ని చెప్ప‌డంతో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వ‌స్తున్నాయి.

నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నాయి.ఇక ప్ర‌తిప‌క్షాలు అయితే ఇంత అహంకార‌మా అంటూ కామెంట్లు చేస్తున్నారు.కేసీఆర్ మ‌రీ ఇంత దారుణంగా మాట్లాడ‌టం దారుణ‌మ‌ని వెంట‌నే క్ష‌మాప‌న ఛెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

Telugu Bandi Sanjay, Dalitha Bandu, Etala Rajender, Huzurabad, Koshik Reddy, Rev

ఇక ఈట‌ల రాజేంద‌ర్ అయితే దీన్ని పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నారు.ఇంత అహంకార పూరితంగా మాట్లాడుతున్న వ్య‌క్తి పార్టీని ఎలా గెలిపిస్తారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కేసీఆర్ అహంకారం పరాకాష్ట‌కు చేరుకుంద‌ని ఇలా అయితే ఆయ‌న ఓట‌మి ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

అయితే కేసీఆర్ ఇలా కామెంట్ చేయ‌డం ఇప్పుడు అన్ని పార్టీల‌కు విమ‌ర్శ‌లు చేసేందుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అయింది.ఆయ‌న అలా మాట్లాడ‌కుంటే ఇప్పుడు ఇన్ని విమ‌ర్శ‌లు చేసేందుకు అవ‌కాశం లేక‌పోయేది.

కావాల‌నే కేసీఆర్ ఇలా మాట్లాడార‌నే చ‌ర్చ‌కూడా సాగుతోంది.మ‌రి ఇంత పెద్ద దుమారం చెలరేగ‌డంతో టీఆర్ ఎస్ ఏమైనా స్పందిస్తుందో లేదోచూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube