వారంతా కేసీఆర్ కు పనికిరాని వారేనా ?  

Kcr Not Intrested To Show The Seniour Trs Leaders - Telugu Jupally Krishna Rao, Kcr, Kcr And Tummala Nageswarao, , Madhusudhana Chary, Telangana Cabinet Ministers, Trs Chief Kcr, Venugopala Chary

రాజకీయం అంటేనే అవకాశవాదం అన్నట్టుగా నేటి రాజకీయాలు తయారయ్యాయి.ఎన్నికల్లో గెలిచిన వారికి తప్ప ఓటమి చెందిన వారికి అంతగా ప్రాధాన్యం ఉండదు.

Kcr Not Intrested To Show The Seniour Trs Leaders - Telugu Jupally Krishna Rao, Kcr, Kcr And Tummala Nageswarao, , Madhusudhana Chary, Telangana Cabinet Ministers, Trs Chief Kcr, Venugopala Chary-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

పార్టీలైన, ఎంతటి సీనియర్ పొలిటీషియన్ అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది.తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లోనూ ఇప్పుడు అదే తంతు జరుగుతోంది.

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అన్ని రకాలుగా అధినేతకు అండగా ఉంటూ వచ్చిన వారికి కెసిఆర్ మొదట్లో అదే స్థాయిలో ప్రాధాన్యం కల్పించారు.కానీ అలా ప్రాధాన్యం పొందిన నాయకులంతా రెండోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనుమరుగయ్యారు.

కెసిఆర్ ఇప్పుడు అటువంటి నాయకులను పక్కనపెట్టేశారు.కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు.

2014లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది సీనియర్ నాయకులు కెసిఆర్ ప్రాధాన్యం ఇచ్చారు.ప్రభుత్వం వారికి పదవులు ఇచ్చి వారి ప్రాధాన్యత గుర్తించినట్లుగా కేసీఆర్ వ్యవహరించారు.తుమ్మల నాగేశ్వరావు, మధుసూదనా చారి, వేణుగోపాల చారి, జూపల్లి కృష్ణారావు ఇలా కొంతమంది నాయకులకు కేసీఆర్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పూర్తిగా పక్కన పెట్టేశారు.

వారంతా ఎన్నికల్లో ఓటమి చెందడంతో తనకు వారి అవసరమే లేదన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తుండడంతో తీవ్ర నిరాశలో వారు ఉండిపోయారు.

2018 ఎన్నికల్లో ఓటమి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు సైలెంట్ గా ఉంటున్నారు.ఆయనపై పోటీ చేసి విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ లో చేరడం తో రాజకీయ హవా తగ్గిపోయింది.అలాగే అదే జిల్లా నుంచి మంత్రిగా పువ్వాడ అజయ్ ఉండడంతో తుమ్మలను కేసీఆర్ పక్కన పెట్టేసినట్టుగా వ్యవహరిస్తున్నారు.

అదేవిధంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని కూడా కేసీఆర్ పట్టించుకోవడమే మానేశారు.ప్రభుత్వం తనకు ఏదైనా పదవి ఇస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న ఆయనకు నిరాశే మిగులుతోంది అని ఆయన సన్నిహితులు వాపోతున్నారు.

మరో టీఆర్ఎస్ కీలక నాయకుడిగా ఉన్న జూపల్లి కృష్ణారావు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.ఎన్నికల్లో ఓటమి తర్వాత కెసిఆర్ తనకు ఏదో ఒక పదవి ఇచ్చి తన ప్రాధాన్యం అందరికీ తెలిసేలా చేస్తారని చూసిన నిరాశే మిగిలింది.

దీంతో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన కొంత మందిని రెబల్స్ గా రంగంలోకి దించాలని చూసినా కెసిఆర్ రాజకీయ వ్యూహాల ముందు జూపల్లి కృష్ణారావు ఎత్తులు పారలేదు.

తాజా వార్తలు

Kcr Not Intrested To Show The Seniour Trs Leaders-kcr,kcr And Tummala Nageswarao,madhusudhana Chary,telangana Cabinet Ministers,trs Chief Kcr,venugopala Chary Related....