ఆ యాగంతో బీజేపీని కేసీఆర్ దెబ్బతీస్తాడా ?

తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూస్తున్న బీజేపీకి అదే స్థాయిలో ఝలక్ ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.ఎలా అయినా సరే తెలంగాణాలో బీజేపీ ఎదగకుండా చేయాలనే దృఢ నిశ్చయంతో కేసీఆర్ పనిచేస్తున్నట్టుగా అర్ధం అవుతోంది.

 Kcr Newslogan For Muncipal Elections 1-TeluguStop.com

అసలు బీజేపీ బలమంతా హిందుత్వ నినాదమే.దేశవ్యాప్తంగా అదే నినాదంతో ముందుకు వెళ్తూ అధికారం చేపట్టింది.

దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా బీజేపీ హిందుత్వ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా గట్టిగానే నిలబడుతోంది ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న మోదీ, అమిత్ షా లు ఇప్పుడు బలంగా ఉండడంతో మైనార్టీల్లో కూడా ఒకరకమైన అభద్రతా భావం పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.

-Telugu Political News

ఇక ప్రస్తుతం కేసీఆర్ కూడా బీజేపీ కి ధీటుగా హిందుత్వ వాదాన్ని తలకెత్తుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు.తెలంగాణ ఎన్నికల్లో బీజేపీని ఢీకొన్న కేసీఆర్ తనకంటే దేశంలో పెద్ద హిందువు ఎవరూ లేరని అసలు తాను చేసినన్ని యాగాలు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు అంటూ కేసీఆర్ కాస్త గట్టిగానే చెప్పుకున్నాడు.అంతే కాదు మోదీ అమిత్ శాలు ఇద్దరూ కూడా అసలు హిందుత్వ వాదులే కాదు అంటూ సవాల్ విసిరి సంచలనం సృష్టించాడు.

ఇక ఇప్పుడు తెలంగాణాలో బీజేపీ పాగా వేయాలని చూస్తుండడంతో పాటు టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని కంకణం కట్టుకోవడంతో బీజేపీని హిందుత్వ అస్త్రంతోనే దెబ్బతీయాలని కేసీఆర్ భావిస్తున్నాడు.

దీని కోసం కేసీఆర్ యజ్ఞ యాగాలను ఎంచుకున్నాడు.

ఇప్పటివరకు కేసీఆర్ వ్యక్తిగతంగా మాత్రమే యజ్ఞ యాగాలు చేసాడు.అయితే ఇప్పడు మాత్రం తెలంగాణ ప్రభుత్వం తరుఫున యాదాద్రిలో మహా సుదర్శన యాగానికి సంకల్పించాడు.

ఈ మెగా యాగాన్ని నిర్వహించడం ద్వారా దేశంలోనే హిందూ ఆచారాలను పాటించే అసలుసిసలైన రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని, ఆ విధంగానైనా బీజేపీ ప్రభావాన్నిబాగా తగ్గించి బీజేపీని దారిలోకి తెచ్చుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడు కేసీఆర్.బీజేపీ కూడా ఎప్పటికప్పుడు కేసీఆర్ ఎత్తుగడలను పసిగడుతూనే ఎత్తులకు పై ఎత్తులు వేసే పనిలో పడింది.

అయితే కేసీఆర్ వేసిన ఈ యాగం ఎత్తుగడలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయన్నదే తేలాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube