2019 ఎన్నికల్లో కేసీఆర్ పక్కా వ్యూహం ఇదే       2018-06-23   03:32:55  IST  Bhanu C

చంద్రబాబు తరువాత రాజకీయ వ్యుహాలని రచించడంలో ఆరితేరిన ఏకైక వ్యక్తి తెలంగాణా సీఎం కేసీఆర్ తెలంగాణా ఉద్యమాన్ని భుజాన వేసుకున్న కేసీఆర్ ఉద్యమాన్ని నడపడంలో ఎదురైనా సవాళ్ళని పక్కా వ్యూహాలతో అడ్డుకున్నారు..ఒకానొక దశలో ఉద్యమం నీరుగారుతోంది అనుకున్నప్పుడు కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ ఉద్యమాన్ని తెలంగాణా ప్రజలలో రగల్చడం లో ఎన్నో ఎత్తులు వేశారు..ఎప్పుడైతే భావోద్వేగాలు పీక్స్ కు టచ్ చేస్తాయో అప్పుడు కొంతకాలం సైలెంట్ గా ఉండి మళ్ళీ ఉద్యమం వేడి తగ్గుతున్న సమయంలో మళ్ళీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే వారు..

తన లక్ష్యసాధన దిశలో వెళ్ళే సమయంలో ఎంతో మంది వెనక్కి లాగే ప్రయత్నాలు కూడా చేశారు.. అయితే ఉద్యమం సక్సెస్ అయితే అధికారం దానంతట అదే వస్తుందని భావించిన కేసీఆర్ ఒక్కనిమిషం సమయం వృధా చేయలేదు..ఆ ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవాలకు బెదిరిపోలేదు. అలాంటి కేసీఆర్ చేతికి అధికారం వచ్చిన తరువాత…దాన్ని నిలుపుకునేందుకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని వేయకుండా ఉంటారా? తన నాలుగేళ్ల పాలనలో ఫస్ట్ ర్యాంక్ రాలేదు కాని ప్రజలలో తనపై అసంతృప్తి పెరుగాకుండా చూసుకున్నారు..

ఇందులో భాగంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఎన్నికల నినాదాన్ని ఫైనలైజ్ చేసినట్లుగా తెలుస్తోంది…ఒకవేళ తాను అంచనా వేసినట్లుగా నవంబరు.. డిసెంబరులలో ఎన్నికలు జరిగితే అందుకు తగ్గట్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈసారి ఎన్నికల నినాదాన్ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈసారి ఎన్నికల నినాదాన్ని భావోద్వేగాల్ని టచ్ చేసేలా రూపొందించినట్లుగా తెలుస్తోంది…సాధ్యం కాదు అనుకున్న తెలంగాణా రాష్ట్రాన్ని చావు అంచులకి వెళ్లి మరీ తెలంగాణా ప్రజలకి అందించిన ఘనుడికి మళ్ళీ అధికారం నిలుపుకోవడం పెద్ద లెక్కకాదు.. అందుకే కేసీఆర్ వచ్చే ఎన్నికలకి సరికొత్త వ్యుహాలు సిద్దం చేశారు..

మళ్ళీ అధికారమే పరమావధిగా ఇప్పటి నుంచి చేయబోయేది చెప్పే వీలుందంటున్నారు. “కేసీఆర్ రుణం తీర్చుకుందామనే” నినాదంతో ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. కష్టసాధ్యమైన తెలంగాణను సాధించిన కేసీఆర్ రుణాన్ని తీర్చుకోవాలన్న కాన్సెప్ట్ ను జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది..ఇదే అంశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ప్రచారాన్నిఅ మొదలు పెడుతున్నారట..మరి ఈ గులాబీ బాస్ ఎక్కుపెడుతున్న స్లోగన్ బాణం ప్రతిపక్షాలని చీల్చుకుని వెళ్తుందేమో వేచి చూడాలి..