నాగార్జున సాగర్ గెలుపుపై కేసీఆర్ కు అనుమానం ఉందా?

తెలంగాణలో ఎన్నికల సంగ్రామం కొనసాగుతోంది.దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలుకొని గ్రేటర్ ఎన్నికలు త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనుంది.

 Kcr Nagarjuna Sagar By Elections Winning-TeluguStop.com

అయితే దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస ఘోర పరాజయం తరువాత, గ్రేటర్ ఎన్నికలో చావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితిలో అలా బయట పడ్డారు.అయితే త్వరలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం చెందడంతో అక్కడ స్థానం ఖాళీ అయింది.

అయితే దుబ్బాకలో బీజేపీ విజయం సాధించిన తరువాత బీజేపీ మరింతగా బలపడ్డ విషయం తెలిసిందే.

 Kcr Nagarjuna Sagar By Elections Winning-నాగార్జున సాగర్ గెలుపుపై కేసీఆర్ కు అనుమానం ఉందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అదే తరహాలో, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ లో పాగా వేయాలని బీజేపీ బలంగా నిర్ణయించుకున్న నేపథ్యంలో, దుబ్బాక తరహాలో సీన్ రిపీట్ కావద్దని టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నాగార్జున సాగర్ ఎన్నికలో గెలవలేమనే అనుమానం కేసీఆర్ కు కలిగినట్టుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఇది ఒక వ్యూహంలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏది ఏమైనా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోరు కూడా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.బీజేపీ తమ ఆధిపత్యాన్ని కొనసాగిచాలనే ఆలోచనతో, అదే విధముగా మరల టీఆర్ఎస్ అదే స్థానంలో సత్తా చాటాలని ఇలా ఇరు పార్టీల మధ్య భీకర పోరు జరిగే అవకాశం ఉంది

.

#KCRDoubts #NagarjunaSagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు