గులాబీ పోలిట్ బ్యూరో బక్క చిక్కుతుందా?

తెలంగాణలో అదికార గులాబీ పార్టీ పోలిట్ బ్యూరో బక్కచిక్కుతుందా? బక్కచిక్కడం అంటే దాని సైజు తగ్గించడం అన్న మాట.ఏ పార్టీలోనైనా పోలిట్ బ్యూరో అనేది విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నతమైన వ్యవస్థ లేదా విభాగం.

 Kcr Mulls Politburo Revamp-TeluguStop.com

దీనిలో ఎంత మంది సభ్యులు ఉండాలి అనే విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు లేవు.సభ్యుల సంఖ్య ఎంత ఉండాలనేది అధినేత ఆలోచన, నిర్ణయం బట్టి ఉంటుంది.

ప్రస్తుతం గులాబీ పార్టీ పోలిట్ బ్యూరో మరీ పెద్దగా జంబో జెట్ విమానంలా ఉందని దీన్ని సింగిల్ డిజిట్ చేయాలని కెసీఆర్ ఆలోచిస్తున్నారట.ఒకప్పుడు పోలిట్ బ్యూరోలో 18 మంది ఉండేవారు.

తరువాత ఆ సంఖ్య 42 కు పెరిగింది.ప్రస్తుతం అక్కడ ఆగింది.

సాధారణంగా మంత్రి పదవులు ఇవ్వని వారిని, నామినేటెడ్ పదవులు ఇవ్వని వారిని పార్టీ కమిటీలలో నియమిస్తుంటారు.దీంతో ఆ కమిటీల సైజులు పెరుగుతుంటాయి.

గులాబీ పార్టీ పోలిట్ బ్యూరో సైజు కూడా అలా పెరిగింది.ఇది కేసీఆర్కు నచ్చలేదు.

దీన్ని సింగిల్ డిజిట్ చాయాలని అనుకుంటున్నారు.సాధ్యమైతే కేవలం ఐదుగురు సభ్యులతో పోలిట్ బ్యూరో ఉండాలని కెసీఆర్ యోచిస్తున్నారు.

ప్రస్తుతం పోలిబ్యురో సభ్యులుగా వున్నవారు మంత్రులుగా పనిచేస్తున్నారు.కొందరు నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు.

ఇలాంటి వారిని తీసేయాలని అనుకుంటున్నారట.తనతో పాటు మరో నలుగురితో పోలిట్ బ్యూరో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

ఆ నలుగురు వరంగల్ కు చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి, కరీంనగర్కు చెందిన నారదాసు లక్ష్మణ్ రావు, మెదక్ కు చెందిన రాజయ్య యాదవ్, రంగా రెడ్డికి చెందిన హరీశ్వర్ రెడ్డి అని ప్రచారం జరుగుతున్నది.పోలిట్ బ్యూరో తగ్గిస్తే కుమారుడు, మేనల్లుడు కూడా బయటకు పోతారేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube