విందుకు కేసీఆర్‌ ఎందుకు రాలేదు?

రాష్ర్టపతి ప్రణబ్‌ ముఖర్జీ గౌరవార్థం ఉమ్మడి రాష్ర్ట గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి హాజరు కాలేదు.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు.

 Kcr Missed Rajbhavan Dinner-TeluguStop.com

విమానాశ్రయంలో గవర్నర్‌కు ఘన స్వాగతం పలికి, ఆయనకు పాదాభివందనం చేసిన కేసీఆర్‌ రాజ్‌భవన్లో విందుకు గైర్హాజరు కాగా, ప్రొటోకాల్‌ నిబంధనలతో ఇబ్బంది పడి రాష్ర్టపతికి స్వాగతం పలకడానికి వెళ్లలేకపోయిన చంద్రబాబు విందుకు హాజరయ్యారు.సీన్‌ ఇలా రివర్సు అయింది.

విందుకు కేసీఆర్‌ ఎందుకు హాజరు కాలేదన్నదానిపై అనేక రకాల ఊహాగానాలు వినవస్తున్నాయి.ఆయన జ్వరంతో బాధపడుతున్నందువల్ల విందుకు హాజరు కాలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఆయన జ్వరంతో బాధపడుతున్నందువల్ల ఈ రోజు ఎవ్వరినీ కాలుసుకోరని, ఏ కార్యక్రమంలోనూ పాల్గొనరని అధికారులు ఉదయమే మీడియాకు సమాచారం పంపినట్లు విలేకరులు చెబుతున్నారు.ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ హాజరయ్యారు.

ఇంకా మరి కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు.గవర్నర్‌ ఇచ్చిన విందుకు కేసీఆర్‌ ఎందుకు హాజరు కాలేదన్నదానిపై చంద్రబాబు కుమారుడు, టీడీపీ నాయకుడు లోకేష్‌ మీడియాతో మాట్లాడతూ విందుకు వెళితే చంద్రబాబు ముఖం చూడాల్సి వస్తుందన్న భయంతోనే కేసీఆర్‌ వెళ్లలేదని అన్నారు.

కేసీఆర్‌కు చంద్రబాబును చూస్తే ధైర్యం లేదన్నారు.అందుకే జ్వరం అని నాటకమాడి విందుకు ఎగ్గొట్టాడన్నారు.

ఈ సాయంత్రం ఇద్దరు చంద్రులు కలుసుకుంటే ఎలా వ్యహరిస్తారో, ఏం మాట్లాడుకుంటారో, అసలు ముఖాల చూసకుంటారో లేదోనని ఉదయం నుంచి మీడియా ప్రతినిధులు, జనం కూడా ఆసక్తిగా ఉన్నారు.ఆ ఆసక్తిని కేసీఆర్‌ నీరుగార్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube